శుక్రవారం 29 మే 2020
International - Mar 29, 2020 , 22:00:25

ఉత్త‌ర కొరియా రూటే సెప‌రేటు...!

 ఉత్త‌ర కొరియా రూటే సెప‌రేటు...!

ప్ర‌పంచం మొత్తం క‌రోనా మ‌హ‌మ్మారితో వ‌ణికిపోతుంటే...ఉత్త‌ర కొరియా మాత్రం త‌న ప‌ని తాను చేసుకుపోతుంది. ప్రపంచంతో త‌మ‌కేం సంబంధం లేనట్లు వ్య‌వ‌హ‌రిస్తోంది. అన్ని దేశాలు క‌రోనా క‌ట్ట‌డికి నానా తంటాలు ప‌డుతుంటే కొరియా  మిస్సైల్ ప‌రీక్ష‌లో త‌ల‌మున‌క‌లై ఉంది. దేశంలోని ఈస్ట్‌కోస్ట్ ఏరియాలో రెండు షార్ట్ రేంజ్ బాలిస్టిక్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించింది. ఈ విష‌యాన్ని సౌత్‌కొరియా అధికారులు ధృవీక‌రించారు. దీంతో ఈ నెల‌లో ఇప్ప‌టి వ‌ర‌కూ నాలుగు బాలిస్టిక్ ప‌రీక్ష‌లు ఉత్త‌ర‌కొరియా జ‌రిపింది. కాగా ఉత్త‌ర‌కొరియాలో ఇప్ప‌టి వ‌రకు ఎన్ని క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయో ప్రపంచానికి తెలియ‌దు.


logo