ఆదివారం 24 మే 2020
International - Mar 21, 2020 , 13:30:51

రెండు మిస్సైళ్లు ప‌రీక్షించిన ఉత్త‌ర‌కొరియా

రెండు మిస్సైళ్లు ప‌రీక్షించిన ఉత్త‌ర‌కొరియా

హైద‌రాబాద్‌:  ఉత్త‌ర‌కొరియా ఇవాళ రెండు మిస్సైళ్ల‌ను ప‌రీక్షించింది.  ఈ విష‌యాన్ని ద‌క్షిణ కొరియా మిలిట‌రీ వెల్ల‌డించింది. స్వ‌ల్ప శ్రేణి బాలిస్టిక్ మిస్సైళ్లు ప‌రీక్షించిన‌ట్లు తెలుస్తోంది.  ప్యోంగ్యాంగ్ ప్రావిన్సు నుంచి తూర్పు దిశ‌గా ఆ క్షిప‌ణుల‌ను ప‌రీక్షించారు. ఈ నెల ఆరంభంలో ఫైరింగ్ డ్రిల్‌లో భాగంగా కొన్ని మిస్సైళ్ల‌ను ఉత్త‌ర‌కొరియా ప్ర‌యోగించింది.  ఒక‌వైపు ప్ర‌పంచం అంతా కోవిడ్‌19తో బాధ‌ప‌డుతుంటే.. ఉత్త‌ర‌కొరియా క్షిప‌ణులు ప్ర‌యోగించ‌డం శోచ‌నీయ‌మ‌ని ద‌క్షిణ కొరియా పేర్కొన్న‌ది.  తాజాగా ప్ర‌యోగించిన మిస్సైళ్లు 410 కిలోమీట‌ర్ల దూరం వెళ్లాయ‌ని, అవి 50 మీట‌ర్ల ఎత్తులో ప్ర‌యాణించిన‌ట్లు తెలుస్తోంది.   


logo