శనివారం 28 నవంబర్ 2020
International - Oct 25, 2020 , 15:20:29

చైనా ఎల్లో డస్ట్‌తో వణికిపోతున్న ఉత్తర కొరియా

 చైనా ఎల్లో డస్ట్‌తో వణికిపోతున్న ఉత్తర కొరియా

 ప్యోంగ్యాంగ్: చైనా నుంచి వస్తున్నఎల్లో డస్ట్‌తో ఉత్తర కొరియా వణికిపోతున్నది. దేశవ్యాప్తంగా అలెర్ట్‌ ప్రకటించడంతోపాటు, నిర్మాణ పనులపై నిషేధం విధించింది. ప్రజలెవ్వరూ ఇండ్ల నుంచి బయటకు రావొద్దని, కిటికీలు క్లోజ్ చేసుకోవాలని అధికారిక మీడియా , కొరియన్‌ సెంట్రల్‌ ద్వారా ప్రజలకు హెచ్చరికలు జారీచేసింది. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వస్తే మాస్కులు ధరించాలని సూచించింది. చైనా నుంచి వచ్చే "ఎల్లో డస్ట్' వల్ల కరోనావైరస్‌... కిమ్‌ సామ్రాజ్యంలోకి వ్యాపిస్తుందనే భయంతోనే ఉత్తరకొరియా ఈ చర్యలు చేపట్టింది.

"ఎల్లో డస్ట్"‌ ద్వారా మహమ్మారి వైరస్‌ దేశంలోకి ప్రవేశించడం వల్ల కలిగే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టాలని అక్కడి అధికారిక దినపత్రిక రొడొంగ్‌ సిన్‌మన్‌ విజ్ఞప్తిచేసింది. వైరస్‌ గాలి ద్వారా కూడా వ్యాపిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు అమెరికా సీడీసీ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఎల్లోడస్ట్‌ను కూడా తీవ్రంగా పరిగణించాలి. అందుచేత ఎల్లోడస్ట్‌ వల్ల కలిగే నష్టాలను నివారించడంలో భాగంగా ప్రవేశించకుండా నిరోధించడమే అత్యంత కీలకం అని రొడొంగ్‌ సిన్‌మన్‌ వ్యాఖ్యానించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.