బుధవారం 02 డిసెంబర్ 2020
International - Nov 04, 2020 , 13:49:02

కోవిడ్‌తో మృతి.. అయినా రిప‌బ్లిక‌న్ నేత విక్ట‌రీ

కోవిడ్‌తో మృతి.. అయినా రిప‌బ్లిక‌న్ నేత విక్ట‌రీ

హైద‌రాబాద్‌: అమెరికాలోని నార్త్ డ‌కోటాకు చెందిన 55 ఏళ్ల రిప‌బ్లిక‌న్ నేత డేవిడ్ అంద‌ల్ అక్టోబ‌ర్ 5వ తేదీన మ‌ర‌ణించారు. కానీ ఆ రాష్ట్ర అసెంబ్లీకి జ‌రిగిన ఎన్నిక‌ల్లో మాత్రం ఆయ‌న విజ‌యం సాధించారు.  కోవిడ్‌19తో మృతిచెందిన నెల రోజుల త‌ర్వాత ఆయ‌న ఇవాళ ప్ర‌క‌టించిన ఫ‌లితాల్లో విజేత‌గా నిలిచారు. నార్త్ డ‌కోటాలోని బిస్‌మార్క్ ప్రాంతంలో రిప‌బ్లిక‌న్ పార్టీ త‌ర‌పున డేవిడ్ అంద‌ల్‌, డేవ్ నెహ‌రింగ్‌లు పోటీప‌డ్డారు.  ఈ జిల్లాలో ప్ర‌జ‌లు ఇద్ద‌రు ప్ర‌తినిధుల‌ను ఎన్నుకుంటారు. అంద‌ల్‌కు 35 శాతం ఓట్లు పోలైన‌ట్లు తెలుస్తోంది. హాస్పిట‌ల్‌లో నాలుగు రోజులు కోవిడ్ చికిత్స పొందిన త‌ర్వాత డేవిడ్ మ‌ర‌ణించార‌ని, రైతుల‌కు, బొగ్గు ప‌రిశ్ర‌మ‌కు ఎంతో సేవ చేయాల‌ని డేవిడ్ తపించిన‌ట్లు ఆయ‌న త‌ల్లి వెల్ల‌డించింది. వాస్త‌వానికి ఇప్పుడు నార్త్ డ‌కోటాలో కోవిడ్ కేసులు ఎక్కువ‌గా ఉన్నాయి.