గురువారం 29 అక్టోబర్ 2020
International - Oct 06, 2020 , 02:28:14

ఆర్మేనియా-అజర్‌బైజాన్‌ మధ్య ఆగని ఘర్షణలు

ఆర్మేనియా-అజర్‌బైజాన్‌ మధ్య ఆగని ఘర్షణలు

యెరెవాన్‌: వివాదాస్పద నాగోర్నో-కరాబాఖ్‌ ప్రాంతంపై పట్టు కోసం ఆర్మేనియా, అజర్‌బైజాన్‌ పరస్పరం దాడులకు దిగుతున్నాయి. అజర్‌బైజాన్‌ నాగోర్నో-కరాబాఖ్‌ రాజధాని స్టెపానాకెర్ట్‌పైకి క్షిపణులను ప్రయోగించిందని ఆర్మేనియా సోమవారం ఆరోపించింది. దానికి ప్రతిగా ఆర్మేనియా తమదేశంలోని రెండో అతిపెద్ద నగరం, పలు పట్టణాలపై దాడి చేసిందని అజర్‌ బైజాన్‌ ప్రత్యారోపణ చేసింది. రెండు దేశాల మధ్య 1994 నుంచి కొనసాగుతున్న యుద్దానికి తెర దించేందుకు ఇరాన్‌ ప్రయత్నాలు చేస్తున్నది. ఆర్మేనియా, అజర్‌బైజాన్‌లతో సరిహద్దు గల ఇరాన్‌ ఆ రెండు దేశాల మధ్య శాంతి కోసం ప్రణాళిక రూపొందిస్తున్నది. నాగోర్నో-కారాబాఖ్‌ ప్రాంతం వాస్తవంగా అజర్‌ బైజాన్‌లోనే ఉన్నా.. ఆర్మేనియా బలగాల నియంత్రణలో కొనసాగుతున్నది. ఇరుదేశాల మధ్య ఘర్షణతో స్టెపానాకెర్ట్‌ నగర వాసులు గ్యాస్‌, విద్యుత్‌ కొరతతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు.  


logo