గురువారం 28 మే 2020
International - Apr 19, 2020 , 01:38:17

ఆంక్షలు పట్టించుకోని మతపెద్దలు.. పాక్‌ సర్కారుకు తలనొప్పులు

ఆంక్షలు పట్టించుకోని మతపెద్దలు.. పాక్‌ సర్కారుకు తలనొప్పులు

ఇస్లామాబాద్‌: కరోనా నియత్రణకు ప్రభుత్వం విధించిన ఆంక్షలను ధిక్కరిస్తున్న మత గురువులను అదుపుచేయడం పాకిస్థాన్‌ సర్కారుకు తలనొప్పిగా మారింది. మసీదుల్లో సామూహిక ప్రార్థనలు నిర్వహించడంపై ప్రభుత్వం ఆంక్షలు విధించినా మతపెద్దలు లెక్కచేయడం లేదు. దీంతో వారికి నచ్చజెప్పడం అధికారులకు సవాల్‌గా మారింది. ఆ దేశ అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వి శనివారం పలువురు మతపెద్దలతో సమావేశమయ్యారు. మసీదుల్లో సామూహిక ప్రార్థనలు నిర్వహించడం ఆపాలని విజ్ఞప్తిచేశారు. ఈ సందర్భంగా 20 అంశాల ప్రణాళికకు అంగీకారం కుదరినట్లు అధ్యక్షుడు తెలిపారు. రంజాన్‌ మాసంలో నిబంధనలకు లోబడి మసీదులో ప్రార్థనలు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. 


logo