శనివారం 30 మే 2020
International - May 04, 2020 , 19:29:43

అధిక శ‌బ్దంతో త‌ల‌నొప్పే కాదు.. క్యాన్స‌ర్ కూడా వ‌స్తుంది!

అధిక శ‌బ్దంతో త‌ల‌నొప్పే కాదు.. క్యాన్స‌ర్ కూడా వ‌స్తుంది!

ఇప్ప‌టివ‌ర‌కు ఎక్కువ శ‌బ్దం విన‌డం వ‌ల్ల గూబ గుయ్యిమ‌న‌డం లేదా త‌ల‌నొప్పి, హైబీపీ వంటి స‌మ‌స్య‌లు  రావ‌డం స‌హ‌జం. కానీ అధిక శ‌బ్దానికి క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని జ‌ర్మ‌నీలోని ‘యూనివర్సిటీ మెడికల్‌ సెంటర్‌ ఆఫ్‌ మెయింజ్‌’ విశ్వవిద్యాలయం  జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. ర‌వాణా ప్ర‌వాహంలో వ‌చ్చే సౌండ్స్‌, పెద్ద పెద్ద మైకుల్లో వినిపించే శ‌బ్దం, అన్నింటిక‌న్నా ఎక్కువ‌గా విమానం ల్యాండింగ్‌, టేకాఫ్ అయ్యేట‌ప్పుడు వ‌చ్చే శ‌బ్దాలు, కేన్స‌ర్ సంబంధిత డీఎన్ఎల‌లో మార్పుల‌కు దారి తీస్తుంది.

ఈ స‌ర్వే ఎలుక‌ల మీద నిర్వ‌హించారు. విమాన శ‌బ్దాల‌ను ఎలుక‌లు నాలుగు రోజులు కూడా త‌ట్టుకోలేక‌పోయాయ‌ని తెలుసుకున్నారు. వాటిలో హైబీపీ, గుండె సంబంధిత స‌మ‌స్య‌ల‌తోపాటు కేన్స‌ర్‌కు కార‌ణ‌మ‌య్యే డీఎన్ఏ దెబ్బ‌తింటుంద‌న్న విష‌యం గుర్తించిన‌ట్లు ప‌రిశోధ‌కులు తెలిపారు.  


logo