బుధవారం 28 అక్టోబర్ 2020
International - Sep 24, 2020 , 16:36:42

‘నోబెల్‌’ ప్రైజ్‌ మనీ పెరిగింది.. ఎంతంటే..?

‘నోబెల్‌’ ప్రైజ్‌ మనీ పెరిగింది.. ఎంతంటే..?

స్వీడ‌న్ : నోబెల్ బ‌హుమ‌తితో పాటు అందే న‌గ‌దు బ‌హుమ‌తి ఈ ఏడాది పెరిగింది. ఈ సంవత్స‌రం 9 నుండి 10 మిలియ‌న్ స్వీడిష్ క్రోన‌ర్‌(1.1 మిలియ‌న్ డాల‌ర్లు)కు పెంచుతూ నోబెల్ ఫౌండేష‌న్ గురువారం నిర్ణ‌యం వెలువ‌రించింది. నోబెల్ ఫౌండేషన్ ఆర్ధిక స్థితిని బలోపేతం చేయడానికి ఇటీవలి సంవత్సరాలలో చేసిన కృషి బహుమతి మొత్తాన్ని పెంచేందుకు వీలు కల్పించింద‌ని ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సాహిత్యం, శాంతి, ఆర్థిక శాస్త్ర రంగాలలో ఈ ఏడాది బహుమతులు అక్టోబర్ 5 వారంలో ప్రకటించబడతాయి. 2012 ప్రారంభం నుండి పెట్టుబడి మూలధనం మూడు బిలియన్ల క్రోనర్ నుండి 4.6 బిలియన్లకు పెరిగింది. మంచి మార్కెట్ ప‌నితీరు, సొంత ఆస్తి నిర్వ‌హ‌ణ నుండి మంచి ఫ‌లితాలు ద‌క్కాయి. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ సంవత్సరం స్టాక్‌హోమ్‌లో జరిగే సాంప్రదాయ అవార్డు ప్రదానోత్సవం రద్దు చేయబడింది. టెలివిజన్ ఈవెంట్ ద్వారా గ్రహీతలు తమ స్వదేశాలలో బహుమతులు అందుకోనున్న‌ట్లు నోబెల్ ఫౌండేషన్ ప్రకటించింది.


logo