శనివారం 26 సెప్టెంబర్ 2020
International - Jul 22, 2020 , 14:58:06

క‌రోనా వేళ‌.. నోబెల్ విందు కార్య‌క్ర‌మం ర‌ద్దు

క‌రోనా వేళ‌.. నోబెల్ విందు కార్య‌క్ర‌మం ర‌ద్దు

హైద‌రాబాద్‌: నోబెల్ బ‌హుమ‌తి గ్ర‌హీత‌ల‌కు ఇచ్చే విందును ఈ ఏడాది ర‌ద్దు చేశారు. క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు నోబెల్ ఫౌండేష‌న్ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది.  గ‌త అర్థ‌శ‌తాబ్ధంలో నోబెల్ బాంకెట్‌ను ర‌ద్దు చేయ‌డం ఇది తొలిసారి.  చివ‌రిసారి 1956లో విందు కార్య‌క్ర‌మాన్ని ర‌ద్దు చేశారు. వివిధ రంగాల్లో పుర‌స్కారాలు గెలిచిన వారితో పాటు సుమారు 1300 మంది అతిథుల‌కు స్టాక్‌హోమ్‌లో భారీ విందును ఏర్పాటు చేస్తారు. అయితే ఈ సారి వేడుక‌ను నిర్వ‌హించ‌డం లేద‌ని ఫౌండేష‌న్ చైర్మ‌న్ లార్స్ హెకెన్‌స్ట‌న్ తెలిపారు. ప్ర‌తి ఏడాది డిసెంబ‌ర్ 10వ తేదీన నోబెల్ బాంకెట్ ఈవెంట్‌ను నిర్వ‌హిస్తుంటారు.   

హంగేరీపై సోవియెట్ యూనియ‌న్ దురాక్ర‌మ‌ణ‌ను వ్య‌తిరేకిస్తూ 1956లో నోబెల్ గ్ర‌హీత‌ల‌కు విందు కార్య‌క్ర‌మాన్ని ర‌ద్దు చేశారు. రెండు ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యాల్లోనూ ఈ కార్య‌క్ర‌మాల‌ను ర‌ద్దు చేశారు. సైన్స్‌, లిట‌రేచ‌ర్‌, పీస్ క్యాట‌గిరీల్లో నోబెల్ పుర‌స్కారాల‌ను ఇస్తుంటారు.  డైన‌మెట్ సృష్టిక‌ర్త ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్ పేరిట నోబెల్ అవార్డుల‌ను 1901 నుంచి బ‌హూక‌రిస్తున్నారు.  మెడిసిన్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, లిట‌రేచ‌ర్‌, పీస్‌, ఎక‌నామిక్స్ రంగాల్లో ఈ ఏడాది య‌ధావిధిగా అవార్డుల‌ను ప్ర‌క‌టించ‌నున్నారు.  నోబెల్ పురస్కారాల‌ను అక్టోబ‌ర్ 5 నుంచి 12వ తేదీ వ‌ర‌కు ప్ర‌క‌టిస్తారు. 

  


logo