శనివారం 23 జనవరి 2021
International - Dec 21, 2020 , 21:24:53

స్ట్రెయిన్‌ ప్రాణాంతకం అని చెప్పలేం: వివేక్‌మూర్తి

స్ట్రెయిన్‌ ప్రాణాంతకం అని చెప్పలేం: వివేక్‌మూర్తి

వాషింగ్టన్‌: బ్రిటన్‌లో వెలుగుచూసిన న్యూ కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌ ప్రాణాంతకం అని నమ్మడానికి ఎటువంటి సంకేతాల్లేవని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్‌ అడ్మినిస్ట్రేషన్‌లో సర్జన్‌ జనరల్‌, ఇండో-అమెరికన్‌ డాక్టర్‌ వివేక్‌మూర్తి పేర్కొన్నారు. న్యూ వైరస్‌ స్ట్రెయిన్‌తో 70 శాతం ఇన్‌ఫెక్షన్లు ఉంటాయని చెప్పడానికి ఎటువంటి సహేతుకమైన కారణం లేదన్నారు. ‘అది మరింత వ్యాప్తి చెందేలా కనిపిస్తున్నది. ఎవరైనా వ్యక్తికి సోకితే అది ప్రాణాంతకం అని  చెప్పడానికి పరీక్షల్లో నిర్ధారణ కాలేదని ఎన్బీసీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. 

బ్రిటన్‌లో కరోనా న్యూ వైరస్‌ స్ట్రెయిన్‌ వెలుగు చూడటంతో భారత్‌తోపాటు పలు దేశాలు.. ఆ దేశం నుంచి విమానాల రాకపోకలపై నిషేధం విధించాయి. తద్వారా బ్రిటన్‌ నుంచి కరోనా వైరస్‌ వ్యాప్తిని నివారించడానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాయి. అయితే, ప్రజలు ఫేస్‌మాస్క్‌ ధరించడంతోపాటు శానిటైజర్‌ వాడుతూ సామాజిక దూరం పాటించాల్సిందేనని డాక్టర్‌ వివేక్‌ మూర్తి హెచ్చరించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo