ఆదివారం 28 ఫిబ్రవరి 2021
International - Jan 20, 2021 , 22:50:05

వివక్షకు తావులేదు: బైడెన్‌

వివక్షకు తావులేదు: బైడెన్‌

వాషింగ్టన్‌: అమెరికాలో వివక్షకు తావులేదని, ప్రజాస్వామ్యం బలంగా ఉన్నదని నూతన అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నారు. బుధవారం ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన ప్రసంగించారు. అందరి అమెరికన్ల అధ్యక్షుడుగా ఉంటాని చెప్పారు. అమెరికా ఇప్పటికే అనేక  అవరోధాలను అధిగమించిందని, ఇంకా సాధించాల్సింది చాలా ఉందని బైడెన్‌ తెలిపారు. హింస, ఉగ్రవాదం, నిరుద్యోగం వంటి సవాళ్లను అధిగమించాల్సి ఉందన్నారు. దీనికి మీ అందరి సహకారం కావాలని, దేశాభివృద్ధికి అందరి చేయూత అవసరమని అన్నారు. కరోనా వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, 4 లక్షల మందిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా నుంచి త్వరలోనే బయటపడతామని బైడెన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లోనైనా మనం ఒడిపోలేదని అన్నారు. ఉపాధ్యాక్షురాలిగా కమలా హ్యారిస్‌ తొలిగా ప్రమాణం చేశారని, అమెరికా చరిత్రలో కొత్త అధ్యయనం మొదలైందని బైడెన్‌ వెల్లడించారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo