ఆదివారం 09 ఆగస్టు 2020
International - Jul 03, 2020 , 14:01:27

పరిస్థితిని మ‌రింత‌ ఉద్రిక్తంగా మార్చొద్దు: చైనా

పరిస్థితిని మ‌రింత‌ ఉద్రిక్తంగా మార్చొద్దు: చైనా

న్యూఢిల్లీ: గ‌ల్వాన్ ఘ‌ర్ష‌ణల నేప‌థ్యంలో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ శుక్ర‌వారం ఉద‌యం ల‌ఢ‌ఖ్‌లో ఆక‌స్మిక ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. మిలిటరీ ఉన్న‌తాధికారుల‌తో క‌లిసి ప్ర‌స్తుతం గ‌ల్వాన్‌లో నెల‌కొని ఉన్న ప‌రిస్థితిని స‌మీక్షించారు. అయితే ప్ర‌ధాన ల‌ఢ‌ఖ్ ప‌ర్య‌ట‌నతో చైనా ఉలిక్కిప‌డుతున్న‌ది. స‌రిహ‌ద్దుల్లో నెల‌కొన్న ప‌రిస్థితుల‌పై ఈ ఉద‌యం మాట్లాడిన చైనా విదేశాంగ శాఖ అధికార ప్ర‌తినిధి జావో లిజియాన్‌.. మోదీ ల‌ఢ‌ఖ్ ప‌ర్య‌ట‌న గురించి ప్ర‌స్తావించ‌కుండానే కొన్ని వ్యాఖ్య‌లు చేశారు.  

ప్ర‌స్తుతం స‌రిహ‌ద్దుల్లో నెల‌కొని ఉన్న‌ ఉద్రిక్త‌త‌ల‌ను త‌గ్గించ‌డం కోసం భార‌త్‌-చైనా ప‌ర‌స్ప‌రం సంప్ర‌తింపులు జ‌రుపుతున్నాయ‌ని, అంతేగాక సైనికప‌రంగా, దౌత్య‌ప‌రంగా చ‌ర్చ‌ల ప్ర‌క్రియ‌ను కొన‌సాగిస్తున్నాయ‌ని జావో లిజియాన్ చెప్పారు. అయితే ఇలాంటి ప‌రిస్థితుల్లో ఇరుదేశాల‌కు చెందిన ఏ ఒక్క‌రు కూడా ప‌రిస్థితిని మ‌రింత ఉద్రిక్తంగా మార్చే ఎలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌కూడ‌ద‌ని వ్యాఖ్యానించారు. కాగా, ప్ర‌ధాని మోదీ ల‌ఢ‌ఖ్ ప‌ర్య‌ట‌నను ఉద్దేశించే లిజియాన్ ఆ వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు తెలుస్తున్న‌ది.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo