సోమవారం 30 మార్చి 2020
International - Mar 19, 2020 , 10:28:56

చైనాలో కొత్త కేసు న‌మోదు కాలేదు..

చైనాలో కొత్త కేసు న‌మోదు కాలేదు..

హైద‌రాబాద్‌:  క‌రోనా పుట్టిన హుబేయ్‌లో కొత్త కేసులు న‌మోదు కాలేదు.  ఆ దేశం తీసుకున్న చ‌ర్య‌ల్లో ఇదో మైలురాయి.  బుధ‌వారం దేశీయంగా ఒక్క కరోనా కేసు కూడా న‌మోదు కాలేద‌ని చైనా ఆరోగ్య సంస్థ ప్ర‌క‌టించింది.  వైర‌స్‌కు కేంద్ర బిందువైన వుహాన్‌లో ఏ కేసు కూడా రికార్డు కాలేదు.  హుబేయ్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 67వేల 800 కేసులు నమోదు అయ్యాయి.  దాంట్లో 57 వేల 678 కేసులు రిక‌వ‌ర్ అయ్యాయి.  కేవ‌లం హుబేయ్‌లో మాత్ర‌మే 3130  మ‌ర‌ణాలు సంభ‌వించాయి. జ‌న‌వ‌రి 23వ తేదీ నుంచి వుహాన్ న‌గ‌రం క్వారెంటైన్‌లో ఉన్న విష‌యం తెలిసిందే.  ఆ న‌గ‌రంలో సుమారు కోటిన్న‌ర జ‌నాభా ఉన్న‌ది.  ఇక హుబేయ్ ప్రావిన్సులో దాదాపు 4 కోట్ల జ‌నాభా ఉన్న‌ది.  హుబేయ్‌లో క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవ‌డం వ‌ల్లే చైనావ్యాప్తంగా వైర‌స్ వ్యాప్తి నియంత్ర‌ణ‌లోకి వ‌చ్చింది. కానీ బ‌య‌టి దేశాల‌ నుంచి వ‌స్తున్న వారి నుంచి పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్న‌ట్లు చైనా నేష‌న‌ల్ హెల్త్ క‌మిష‌న్ వెల్ల‌డించింది.

 


logo