మంగళవారం 22 సెప్టెంబర్ 2020
International - Jul 26, 2020 , 02:59:39

శ్రీలంకలో సమూహ వ్యాప్తి లేదు

శ్రీలంకలో సమూహ వ్యాప్తి లేదు

  • కొవిడ్‌-19 టాస్క్‌ఫోర్స్‌ అధిపతి వెల్లడి

కొలంబో, జూలై 25: శ్రీలంకలో కరోనా వైరస్‌ సమూహ వ్యాప్తిని పూర్తిగా అడ్డుకోవడంలో విజయం సాధించామని కొవిడ్‌-19 టాస్క్‌ఫోర్స్‌కు నాయకత్వం వహిస్తున్న లెఫ్టినెంట్‌ జనరల్‌ శావేంద్ర సిల్వా చెప్పారు. గత మూడు నెలల నుంచి దేశంలో ఒక్కటి కూడా సమూహ వ్యాప్తి కేసు నమోదు కాలేదని తెలిపారు. దేశంలో కరోనాను అడ్డుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని, వైరస్‌ రెండోసారి విజృంభిస్తున్నదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో సిల్వా ఈ వివరాలు తెలియజేశారు. శ్రీలంకలో ఇప్పటి వరకు 2,764 కరోనా కేసులు నమోదుకాగా.. 11 మంది మరణించారు.


logo