మంగళవారం 22 సెప్టెంబర్ 2020
International - Jul 16, 2020 , 16:29:56

చాబహర్ రైల్వే ప్రాజెక్ట్‌పై భారత్‌తో ఒప్పందం లేదు: ఇరాన్

చాబహర్ రైల్వే ప్రాజెక్ట్‌పై భారత్‌తో ఒప్పందం లేదు: ఇరాన్

టెహ్రాన్: చాబహర్ పోర్టు రైల్వే ప్రాజెక్ట్‌పై భారత్‌తో ఎలాంటి ఒప్పందం లేదని ఇరాన్ పేర్కొంది. ఈ ప్రాజెక్టు నుంచి భారత్ తప్పుకున్నట్లు ఒక వార్తా పత్రికలో వచ్చిన కథనాన్ని ఆ దేశం తప్పుపట్టింది. ఇరాన్‌లోని చాబహర్ పోర్టులో పెట్టుబడులకు సంబంధించి భారత్‌తో రెండు ఒప్పందాలు జరిగినట్లు ఆ దేశ పోర్టుల సంస్థకు చెందిన డిప్యూటీలో ఒకరైన ఫర్హాద్ మోంటాసెర్ తెలిపారు. పోర్టు యంత్రాలు, పరికరాలకు సంబంధించి ఒక ఒప్పందం, 150 మిలియన్ డాలర్ల పెట్టుబడులకు సంబంధించి మరో ఒప్పందం కుదిరినట్లు ఆయన చెప్పారు. చాబహర్ పోర్టుకు సంబంధించి ఇరు దేశాల సహకారంపై ఎలాంటి ఆంక్షలు లేవని ఆయన స్పష్టం చేశారు. దీని గురించి భారతీయ పత్రికలో వచ్చిన కథనం పూర్తి అవాస్తవమని ఫర్హాద్ వెల్లడించారు.
 logo