బుధవారం 08 ఏప్రిల్ 2020
International - Mar 27, 2020 , 14:52:49

నో క్యాష్‌ డెలివరీ - కరోనా కట్టడికి అమేజాన్‌ నిర్ణయం

నో క్యాష్‌ డెలివరీ - కరోనా కట్టడికి అమేజాన్‌ నిర్ణయం

ఈ-కామర్స్‌ దిగ్గజం అమేజాన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ వ్యాధి నిరోధానికి దేశమంతా లాక్‌డౌన్‌ అయిన దరిమిలా చాలారోజులుగా అమేజాన్‌ కొత్త ఆర్డర్లను స్వీకరించడం లేదు. ఈ నేపథ్యంలో అమేజన్‌ తన వినియోగదారులకు తాజాగా మరో రెండు నిర్ణయాల్ని ప్రకటించింది. గతంలోనే ఆర్డర్స్‌ ఇచ్చిన వారికి సంబంధిత వస్తువులు గోడౌన్ల నుంచి బయటికి వెళ్లినప్పటికీ వాటి డెలివరీని తాత్కాలిక నిలిపివేసినట్లు ప్రకటించింది. కేవలం అత్యవసర (ఎమర్జన్సీ ఉత్పత్తులు) ఉత్పత్తులకు సంబంధించిన వస్తువుల ఆర్డర్లు తీసుకోవడంతో పాటు వాటి డెలివరీని కూడా నిర్ణీత సమయంలో అందిస్తామని స్పష్టం చేస్తుంది. అయితే అత్యవసర ఉత్పత్తులకు సంబంధించిన వస్తువులను కూడా ముందుగా ఆన్‌లైన్‌లో చెల్లింపులు (ప్రీ ఆన్‌లైన్‌ ప్రేమెంట్‌) జరిపిన వారికే అందిస్తామని ప్రకటించింది. గతంలో లెక్క క్యాష్‌ డెలివరీ కొనసాగిస్తే కోవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తికి దోహదపడినట్లవుతుందని భావించిన అమేజాన్‌ నో క్యాష్‌ డెలివరీకి నిర్ణయం తీసుకుంది. logo