గురువారం 21 జనవరి 2021
International - Dec 30, 2020 , 07:33:58

ఇక 1 + 1 ఆఫర్లపై నిషేధం!

ఇక 1 + 1 ఆఫర్లపై నిషేధం!

లండన్‌: ఒకటి మరొకటి ఉచితం వంటి ఆఫర్లకు ఫుల్‌స్టాప్‌ పడనుంది. కొవ్వు, ఉప్పు, చక్కె‌రలు ఎక్కు‌వగా ఉన్న ఆహార పదా‌ర్థాలు, పానీ‌యా‌లను ఆఫర్ల పేరిట ప్రజ‌లకు అంట‌గ‌డు‌తున్నారనే కారణంతో ఇలాంటి ప్రకటణలపై కొరడా ఝలిపించాలని బ్రిటన్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఊబ‌కా‌యా‌నికి కార‌ణ‌మయ్యే ఇలాంటి ఆహార పదా‌ర్థా‌లపై ఇస్తున్న ‘ఒ‌కటి కొంటే ఒకటి ఉచితం’ వంటి ఆఫ‌ర్లపై ఏప్రిల్‌ 2022 నుంచి నిషేధం విధి‌స్తు‌న్నట్టు ప్రక‌టిం‌చింది. 

ఈ కొత్త నిబంధనలతో రిటైల్‌ వ్యాపారులు ఇక ‘ఒకటి కొంటే ఒకటి ఉచితం’, ‘రెండింటి ధరలో మూడు కొనండి’ అనే ప్రకటనలు ఇచ్చే అవకాశంలేదు. అదేవిధంగా ఆన్‌లైన్‌లో కూడా అనారోగ్యకరమైన ఆహార పదార్థాల ప్రకటనలు, స్టోర్‌ ప్రవేశ, నిష్క్రమణ ద్వారాల వద్ద కూడా ఇలాంటి పదార్థాలను ఉంచకూడదనే నిబంధన అమల్లోకి రానుంది.  


logo