వాషింగ్టన్: ఒకవేళ 2024 అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తే అప్పుడు ఆ పోటీ నుంచి తాను తప్పుకోనున్నట్లు నిక్కీ హాలే తెలిపారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పాలన సమయంలో.. ఐక్యరాజ్యసమితి అంబాసిడర్‌గా నిక్కీ హాలే చేశారు. ఒకవేళ రాబోయే ఎన్నికల ట్రంప్ పోటీ చేస్తే ఆయనకు మద్దతు ఇవ్వనున్నట్లు ఆమె చెప్పారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా పోటీ చేయనని స్పష్టం చేశారు. రిపబ్లికన్ పార్టీ కి ఏదో ఒక రోజు నిక్కీ హాలే నాయకత్వం వహిస్తుందని కొందరు భావిస్తున్నారు. ఒకవేళ అధ్యక్ష పదవికి ట్రంప్ పోటీ చేయకుంటే.. అప్పుడు నిక్కీనే ఆ ఛాన్సు వరించే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ అంశం గురించి ట్రంప్‌తో మాట్లాడనున్నట్లు కూడా ఆమె వెల్లడించారు. ట్రంప్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నట్లు ఆమె గతంలో చెప్పింది. కానీ జనవరి ఆరవ తేదీన జరిగిన క్యాపిటల్ హిల్ ఘటనకు ముందే ట్రంప్‌తో మాట్లాడినట్లు ఆమె వెల్లడించారు. క్యాపిటల్ హిల్ ఘటనలో ట్రంప్ పాత్రను తొలుత ఆమె విమర్శించినా.. ఆ తర్వాత ఆయన్ను మెచ్చుకున్నారు.