శనివారం 26 సెప్టెంబర్ 2020
International - Jul 20, 2020 , 06:42:10

నైజీరియా విదేశాంగ మంత్రికి క‌రోనా

నైజీరియా విదేశాంగ మంత్రికి క‌రోనా

మాస్కో: నైజీరియా విదేశాంగ మంత్రి జెఫ్రీ ఒన్యామాకు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. గ‌తంలో మూడుసార్లు క‌రోనా ప‌రీక్ష‌లు చేయ‌గా పాజిటివ్ వ‌చ్చింది. కానీ నిన్న నిర్వ‌హించిన ప‌రీక్ష‌లో మాత్రం ఆయ‌న‌కు పాజిటివ్ వ‌చ్చింది. త‌న‌కు క‌రోనా ల‌క్ష‌ణాల్లో ఒక‌టైన‌ గొంతు నొప్పి రావ‌డ‌తో ప‌రీక్ష‌లు చేయించుకున్నాని, పాజిటివ్ వ‌చ్చింద‌ని ట్వీట్ చేశారు. జీవితంలో కొద‌రు విజ‌యం సాధిస్తారు, మ‌రికొంద‌రు అప‌జ‌యంపాల‌వుతారు. మంచి జ‌ర‌గాల‌ను దేవున్ని ప్రార్ధిస్తున్నాని అందులో పేర్కొన్నారు. 

ఈ ప‌శ్చిమాఫ్రికా దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు 36,107 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. అదేవిధంగా క‌రోనా వ‌ల్ల 778 మంది మ‌ర‌ణించారు. 


logo