శనివారం 30 మే 2020
International - Apr 14, 2020 , 10:57:00

లాక్ డౌన్ పొడిగించిన నైజీరియా

లాక్ డౌన్ పొడిగించిన నైజీరియా

లాగోస్‌: క‌ర‌నా వైర‌స్ ప్ర‌పంచ‌దేశాల‌ను అత‌లాకుతులం చేస్తోన్న విష‌యం తెలిసిందే. క‌రోనాను నియంత్రించేందుకు అన్ని దేశాల మాదిరిగానే నైజీరియా ప్ర‌భుత్వం కూడా మార్చి 30న లాక్ డౌన్ ప్ర‌క‌టించింది. అయితే లాక్ డౌన్ ను మ‌రో 14 రోజులు పొడిగిస్తూ నైజీరియా అధ్య‌క్షుడు మ‌హ్మ‌ద్ బుహారి ప్ర‌క‌టించారు. ఇది జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య‌. ప్ర‌స్తుతం ప‌రిణామాల దృష్ట్యా లాక్ డౌన్ పొడిగింపు అనివార్య‌మ‌ని బుహారి అన్నారు.

నైజీరియాలో ఇప్ప‌టి వ‌ర‌కు 323 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. వీటిలో 71 శాతం కేసులు రాజధాని న‌గ‌రం అబుజాతోపాటు లాగోస్ లో న‌మోద‌య్యాయి. నైజీరియా 200 మిలియ‌న్ల జ‌నాభాతో ఆఫ్రికా దేశాల్లో అత్య‌ధిక జ‌నాభా క‌లిగిన దేశంగా ఉంది. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo