మంగళవారం 26 జనవరి 2021
International - Dec 14, 2020 , 11:58:42

మ‌రో ఆర్నెళ్లు భ‌యాన‌క‌మే : బిల్ గేట్స్ వార్నింగ్‌

మ‌రో ఆర్నెళ్లు భ‌యాన‌క‌మే :  బిల్ గేట్స్ వార్నింగ్‌

హైద‌రాబాద్‌:  కోవిడ్‌19 వ్యాక్సిన్ కోసం మైక్రోసాఫ్ట్ స‌హా వ్య‌వ‌స్థాప‌కుడు బిల్ గేట్స్  ప‌లు ఫార్మ‌సీ సంస్థ‌ల‌కు ఫండింగ్ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఆదివారం ఆయ‌న ఓ హెచ్చ‌రిక చేశారు.  రానున్న నాలుగు నుంచి ఆరు నెల‌లు క‌రోనా మ‌హమ్మారి అంశం కీల‌కం కానున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.  రానున్న ఆరు నెల‌ల్లో సుమారు రెండు ల‌క్ష‌ల మంది క‌రోనా వైర‌స్ వ‌ల్ల మృతిచెందే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఇన్స్‌టిట్యూట్ ఫ‌ర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యువేష‌న్ అంచ‌నా వేసింద‌ని, ఒక‌వేళ మ‌నం మాస్క్‌లు ధ‌రించ‌డం లాంటి నియ‌మాళి పాటిస్తే,  అప్పుడు మ‌నం చాలా వ‌ర‌కు మ‌ర‌ణాల‌ను నియంత్రించ‌వ‌చ్చు అని బిల్ గేట్స్ అన్నారు.  గ‌త కొన్ని వారాల నుంచి మ‌ళ్లీ అమెరికాలో క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు గ‌రిష్ట స్థాయిలో న‌మోదు అవుతున్నాయి. అయితే కేసుల‌ను త‌గ్గించ‌డంలో అమెరికా మ‌రింత ప్ర‌య‌త్నిస్తుంద‌ని ఆశించిన‌ట్లు చెప్పారు.  2015లో తాను ఊహించిన దాని కన్నా త‌క్కువ మ‌ర‌ణాలే సంభ‌వించినా..  అమెరికాతో పాటు ఇత‌ర దేశాల్లో తాను అంచ‌నా వేసిన దాని క‌న్నా ఎక్కువ స్థాయిలో ఆర్థిక సంక్షోభం ఏర్ప‌డింద‌న్నారు.  వ్యాక్సిన్ త‌యారీలో భాగంగా సీఈపీఐకి ఫండింగ్ చేస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. వ్యాక్సిన్ పంపిణీలో అమెరికా మాన‌వ‌త్వం చాటాల‌ని, కేవ‌లం అమెరిక‌న్ల‌కు మాత్ర‌మే కాకుండా ఇతర దేశస్థుల‌కు కూడా టీకా ఇవ్వాల‌న్నారు.   logo