గురువారం 28 మే 2020
International - Apr 07, 2020 , 11:58:20

న్యూయార్క్ జైలులో కరోనాతో ఖైదీ మృతి

న్యూయార్క్ జైలులో కరోనాతో ఖైదీ మృతి

హైదరాబాద్: న్యూయార్క్ నగరంలోని రైకర్స్ ఐల్యాండ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీ కరోనా సోకి మృతి చెందాడు. చిల్లర కేసులో జైలుశి్క్ష పడిన మైకేల్ టైసన్ (53) బెల్లివ్యూ హాస్పిటల్‌లో మరణించినట్టు లీగల్ ఎయిడ్ సొసైటీ తెలిపింది. ఇంతకూ అతడు చేసిం పెద్ద నేరమేమీ కాదు. పెరోల్ ఉల్లంఘన, అదీ కరోనా కారణంగా కర్ఫ్యూ ఉల్లంఘన వంటి చిన్న నేరానికి టైసన్ ను జైలులో పెడితే కరోనా సోకింది. పిబ్రవరి 28న అతడిని జైలులో వేశారు. మార్చి 26న కరోనా ముదరడంతో ఆస్పత్రికి తీసుకువెళ్లారు. కరోనా సోకేందుకు, లేదా కరోనా వల్ల ప్రాణాపాయం ఉన్న టైసన్ లాంటివాళ్లని విడుదల చేయాలన్న విజ్ఞాపనను న్యూయార్క్ గవర్నర్ కూమో ఆమోదించి ఉంటే అతడి ప్రాణాలు దక్కేవని సొసైటీకి చెందిన న్యాయవాది టీనా లువోంగో ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చిన్నచిన్న సాంకేతిక కారణాలపై జైలులో పెట్టిన 100 మందిని విడుదల చేయాలని సొసైటీ ఒక వ్యాజ్యం దాఖలు చేసింది. ఆ 100 మంది జాబితాలో టైసన్ పేరు కూడా ఉంది. ఆ కేసు కోర్టు పరిశీలనలో ఉండగానే అతడు కరోనాకు గురై  మరణించాడు.


logo