శనివారం 30 మే 2020
International - Apr 10, 2020 , 10:33:31

న్యూయార్క్‌లో ఫలితాలిస్తున్న సామాజిక దూరం

న్యూయార్క్‌లో ఫలితాలిస్తున్న సామాజిక దూరం

హైదరాబాద్: కనివిని ఎరుగని ఘోరకలి చూసిన న్యూయార్క్ నగరంలో కొత్త కరోనా కేసులు వరుసగా రెండోరోజు తగ్గినప్పటికీ మరణాల సంఖ్య మాత్రం ఇంకా దిగిరావడం లేదు. అమెరికాలో కరోనా కల్లోలానికి న్యూయార్క్ కేంద్రబిందువుగా మారిన సంగతి తెలిసిందే. కాగా మరణాల రేటు మూడోరోజూ రికార్డు స్థాయిలో 800 పెరగడం ఆందోళన కలిగిస్తున్నది. కొత్త కేసులు పెరగకపోవడానికి సామాజిక దూరాన్ని పాటించడమే కారణమని, దీనిని ఏమాత్రం సడలనీయక కటినంగా అమలు చేయాలని గవర్నర్ ఆండ్రూ కూమో విజ్ఞప్తి చేశారు. నేడు ఇన్ఫెక్షన్ రేటు తగ్గింది కదా అని నిశ్చింతపడరాదని, ఇది నిన్న మనం పాటించిన కట్టడి ఫలితమేనని గుర్తించాలని ఆయన నొక్కిచెప్పారు. కరోనా వ్యాప్తి అదుపులోకి వస్తున్న సూచనలు కనిపించడంతో అమెరికా మరణాల అంచనాలను లక్ష నుంచి 60 వేలకు సవరించారు. న్యూయార్క్ దుస్థితికి హార్ట్ ఐల్యాండ్ అద్దం పడుతున్నది. లాంగ్ ఐల్యాండ్ పశఅచిమకొసన ఉన్న ఆ దీవిలో కాంట్రాక్టు ఉద్యోగులు రోజుకు రెండు డజన్ల శవాలను పైన్ చెట్టు కర్రతో తయారు చేసిన శవపేటికల్లో ఉంచి ఖననం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఖననాలు ఎడతెరిపి లేకుండా సాగుతున్నాయి.


logo