సోమవారం 25 మే 2020
International - Apr 02, 2020 , 19:29:59

న్యూస్ ఫ్రం హోం.. అంగీ లేకుండా కెమెరా ముందుకు

న్యూస్ ఫ్రం హోం.. అంగీ లేకుండా కెమెరా ముందుకు

హైదరాబాద్: వర్క్ ఫ్రం హోం.. అదే ఇంటి నుంచి పని చేయడం అనేది ఇప్పుడు బాగా వినవస్తున్న మాట. కరోనా వైరపస్ భయంతో చాలా కంపెనీలు ఈ బాట పడుతున్నాయి. ముఖ్యంగా ఐటీ, మీడియా సిబ్బందికి వర్క్ ఫ్రం హోం ఇస్తున్నారు. అయితే ఇందులోనూ సాధకబాధకాలు లేకపోలేదు. ఆ మధ్య ఓ యాంకరు ఇంటిలో నుంచి వార్తలు చదువుతుంటే అతని చిన్నారి పాప ఫ్రేంలోకి రావడం అందరినీ నవ్వించింది. తాజాగా జెస్సికా లాంగ్ అనే ఓ యాంకర్ వార్తలు చదువుతుంటే ఆమె తండ్రి అంగీ లేకుండా ఫ్రేం లోకి రావడం నెట్‌లో వైరల్ అవుతున్నది. అమ్మో వర్క్ ఫ్రం హోం అంటే సులభమని అనుకున్నా, కానీ ఎన్ని చిక్కులో అని ఆమె ట్విట్టర్ లో వాపోయారు


logo