శనివారం 11 జూలై 2020
International - Jun 14, 2020 , 01:13:29

సాలె పురుగుకు గ్రెటా పేరు!

సాలె పురుగుకు గ్రెటా పేరు!

పారిస్‌: మడగాస్కర్‌లో ఇటీవల కొత్తగా కనుగొన్న ఓ సాలెపురుగు జాతికి ప్రముఖ పర్యావరణవేత్త గ్రెటా థన్‌బర్గ్‌ పేరు మీదుగా థన్‌బెర్గా.జెన్‌.నవ్‌ అని పెట్టారు. పర్యావరణ పరిరక్షణకు గ్రెటా చేస్తున్న కృషికి గౌరవ సూచకంగా ఈ పేరు పెట్టినట్లు జర్మన్‌కు చెందిన ప్రముఖ కీటకశాస్త్ర నిపుణుడు పీటర్‌ జాగెర్‌ తెలిపారు. ఆయనే ఈ సాలెపురుగు జాతిని కనుగొన్నారు.‘భూతాపం కారణంగా జీవవైవిధ్యం తీవ్రంగా దెబ్బతింటున్నది. మడగాస్కర్‌లోని సాలెపురుగులకు కూడా ముప్పు పొంచి ఉన్నది. ఇప్పటికే చాలా అంతరించిపోయాయి’ అని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. 


logo