బుధవారం 25 నవంబర్ 2020
International - Nov 02, 2020 , 15:07:38

న్యూజిలాండ్ ఉప ప్ర‌ధానిగా 'స్వ‌లింగ సంప‌ర్కుడు'

న్యూజిలాండ్ ఉప ప్ర‌ధానిగా 'స్వ‌లింగ సంప‌ర్కుడు'

హైద‌రాబాద్ :  న్యూజిలాండ్  ప్రధాన మంత్రి జసిందా ఆర్డెర్న్ సోమవారం కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు.  స్వ‌లింగ సంప‌ర్కుడైన గ్రాంట్ రాబ‌ర్ట్ స‌న్‌ను ఉప ప్ర‌ధానిగా ఆర్డెర్న్ నియ‌మించారు. ఉప ప్ర‌ధానిగా ఒక స్వ‌లింగ సంప‌ర్కుడు నియామ‌కం కావ‌డం ఇదే తొలిసారి. గ‌త నెల‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో లిబ‌ర‌ల్ లేబ‌ర్ పార్టీ భారీ విజ‌యం సాధించ‌డంతో.. న్యూజిలాండ్ ప్రధాన మంత్రిగా జసిందా అర్డెర్న్ రెండోసారి ఎన్నికయ్యారు. 

రాబ‌ర్ట్ స‌న్‌ను ఉప ప్ర‌ధానిగా నియ‌మించ‌డ‌మే కాదు.. అట్ట‌డుగు వ‌ర్గ‌మైన మావోరి తెగ‌కు చెందిన నాయ‌కుల‌కు కూడా జ‌సిందా త‌న మంత్రివ‌ర్గంలో చోటు క‌ల్పించింది. విదేశాంగ శాఖ మంత్రి నానియా మ‌హుతాను, శిశు అభివృద్ధి శాఖ మంత్రిగా కేల్విన్ డేవిస్‌ను నియ‌మించి.. వారి ప‌ట్ల త‌నుకున్న అభిమానాన్ని జ‌సిందా చాటుకున్నారు. ఉప ప్ర‌ధానిగా నియామ‌క‌మైన రాబ‌ర్ట్‌స‌న్ త‌న‌కున్న ఆర్థిక శాఖ‌ను కొన‌సాగించ‌నున్నారు. గ‌త నెల‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఉప ప్ర‌ధానిగా కొన‌సాగిన విన్‌స్ట‌న్ పీట‌ర్స్ ఓట‌మి చెంద‌డంతో.. రాబ‌ర్ట్‌స‌న్‌కు ఈ ప‌ద‌వి ల‌భించింది. 

ఈ సంద‌ర్భంగా రాబ‌ర్ట్‌స‌న్ మాట్లాడుతూ.. త‌న‌కు యంగ్ గేస్, లెస్బియ‌న్స్‌తో పాటు ట్రాన్స్‌జెండ‌ర్ల నుంచి త‌మ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ అనేక మెయిళ్లు వ‌చ్చేవి అని తెలిపారు. వారి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే దిశ‌గా కృషి చేశాన‌ని, భ‌విష్య‌త్‌లో కూడా వారికి మ‌ద్ద‌తుగా ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు. త‌న‌కు ఉప ప్ర‌ధాని ప‌ద‌వి ల‌భించ‌డం గ‌ర్వంగా ఉంద‌ని రాబ‌ర్ట్ స‌న్ తెలిపారు. ( చూడండి : పుట్టగొడుగులతో ఎన్ని లాభాలో తెలుసా?.. వీడియో )