సోమవారం 21 సెప్టెంబర్ 2020
International - Aug 16, 2020 , 12:28:14

న్యూజిలాండ్‌లో మళ్లీ కరోనా కేసులు..ఆక్లాండ్‌లో లాక్‌డౌన్‌

న్యూజిలాండ్‌లో మళ్లీ కరోనా కేసులు..ఆక్లాండ్‌లో లాక్‌డౌన్‌

వెల్లింగ్టన్‌: క‌రోనా మ‌హ‌మ్మారిపై  విజ‌యం సాధించినట్లు ప్రకటించిన న్యూజిలాండ్‌లో దాదాపు 100 రోజుల తరువాత  మళ్లీ  కరోనా కేసులు నమోదవుతున్నాయి.  గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 13 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు న్యూజిలాండ్‌ వెల్లడించింది.  కొత్త కేసులలో ఒకటి మినహా మిగతావన్నీ కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్లు అని అధికారులు తెలిపారు. కరోనా సోకిన 13వ వ్యక్తి ఇటీవల విదేశాల నుంచి  రాగా ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్‌లో యాక్టివ్‌ కేసుల సంఖ్య 69కు చేరింది.

దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,271కు పెరిగింది. దేశ సరిహద్దుల‌ను మూసివేసిన  3 నెలల తరువాత క‌రోనా మహమ్మారిని త‌రిమికొట్టిన‌ట్లు న్యూజిలాండ్ ప్రకటించిన విషయం  తెలిసిందే. 102 రోజుల తర్వాత మళ్లీ కొత్త కేసులు వెలుగులోకి రావడంతో ఆక్లాండ్‌లో 12 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించారు.  దేశంలో కరోనా కేసుల సంఖ్య   29కి పెరిగిన తరువాత, న్యూజిలాండ్ ప్రధాన మంత్రి  జెసిండా ఆర్డెర్న్  దేశంలో   కోవిడ్ -19  నియంత్రణ కోసం   12 రోజుల పాటు లాక్‌డౌన్‌ను  ప్రకటించారు.

తాజావార్తలు


logo