గురువారం 02 ఏప్రిల్ 2020
International - Mar 14, 2020 , 13:18:19

దేశంలోకి ఎవ‌రొచ్చినా.. సెల్ఫ్ ఐసోలేష‌న్‌

దేశంలోకి ఎవ‌రొచ్చినా.. సెల్ఫ్ ఐసోలేష‌న్‌

హైద‌రాబాద్‌: నోవెల్ క‌రోనా వైర‌స్ భీక‌రంగా ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో.. న్యూజిలాండ్ దేశం క‌ఠిన నియ‌మాన్ని విధించింది. ఆదివారం రాత్రి నుంచి దేశానికి వ‌స్తున్న వారెవ‌రైనా.. స్వ‌యంగా ఐసోలేష‌న్‌లోకి వెళ్లాల‌ని ఆ దేశ ప్ర‌ధాని జెసిండా ఆర్డెన్ తెలిపారు. ఇప్పుడు క్ష‌మాప‌ణ‌లు చెప్పుకునే స‌మ‌యం కాదు అని, అసాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొన్నాయ‌ని ఆమె అన్నారు.  తాము అమ‌లు చేయ‌నున్న రూల్స్  ప్ర‌పంచంలోనే అత్యంత క‌ఠిన‌మైన‌వ‌ని ప్ర‌ధాని జెసిండా అన్నారు. న్యూజిలాండ్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఆరు క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. అయితే త‌మ ఆదేశాల‌పై మ‌రో 16 రోజుల త‌ర్వాత స‌మీక్ష ఉంటుంద‌న్నారు.  ప్ర‌జ‌ల నిత్యావ‌స‌రాల కోసం విమాన‌, ఓడ‌ల ద్వారా జ‌రిగే ర‌వాణాలు మాత్రం య‌ధావిధిగా కొన‌సాగుతాయ‌న్నారు. ఇజ్రాయిల్ కూడా ఇదే త‌ర‌హా సెల్ఫ్ క్వ‌రెంటైన్ నియ‌మాన్ని విధించింది. సెల్ఫ్ ఐసోలేష‌న్ నేప‌థ్యంలో కివీస్ క్రికెట‌ర్లు ఆసీస్ టూర్ నుంచి మ‌ధ్య‌లోనే వెన‌క్కి వెళ్తున్నారు.


logo