మంగళవారం 22 సెప్టెంబర్ 2020
International - Aug 08, 2020 , 22:24:38

శ్రీకృష్ణుడి సన్నిధిలో న్యూజిలాండ్‌ ప్రధాని..

శ్రీకృష్ణుడి సన్నిధిలో న్యూజిలాండ్‌ ప్రధాని..

ఆక్లాండ్‌: న్యూజిలాండ్‌ దేశంలోని ఆక్లాండ్‌లోగల రాధాకృష్ణ ఆలయాన్ని ఆదేశ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ సందర్శించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆమె కారులోంచి దిగి ఆలయంలోకి ప్రవేశించింది. అందరికీ భారతీయ సంప్రదాయం ప్రకారం నమస్కరించింది.

ఆమె ఆలయంలో దేవునికి నమస్కరిస్తూ నిల్చోగా, అర్చకులు సంస్కృతంలో మంత్రాలు చదివారు. పూజ అయ్యేంతవరకూ ఆమె రెండు చేతులూ జోడించి నిల్చుంది. అనంతరం అర్చకులు ఆమెకు తీర్ధప్రసాదాలు ఇచ్చి, శాలువాకప్పి ఆశీర్వదించారు.  అనంతరం భారతీయుల వంటకమైన చోలే పూరిని ఆమె తిన్నారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo