శుక్రవారం 03 జూలై 2020
International - May 25, 2020 , 11:44:29

ఒక్క డాల‌ర్‌కే ప్ర‌ముఖ మీడియా సంస్థ‌ను అమ్మేశారు..

ఒక్క డాల‌ర్‌కే ప్ర‌ముఖ మీడియా సంస్థ‌ను అమ్మేశారు..


హైద‌రాబాద్‌:  ఒకే ఒక్క డాల‌ర్‌కు ఓ ప్ర‌ముఖ మీడియా సంస్థ అమ్ముడుపోయింది. న్యూజిలాండ్‌కు చెందిన స్ట‌ఫ్ మీడియా సంస్థను దాని సీఈవోనే ఒక్క‌ డాల‌ర్‌కు కొనేశారు.  న్యూజిలాండ్‌లో స్ట‌ఫ్ మీడియా సంస్థ‌కు ప్ర‌త్యేక గుర్తింపు ఉన్న‌ది. ప‌లు జాతీయ దిన‌ప‌త్రిక‌ల‌ను, ఓ పాపుల‌ర్ వెబ్‌సైట్‌ను కూడా స్ట‌ఫ్ న‌డిపిస్తున్న‌ది. ఆ సంస్థంలో 900 మంది ఉద్యోగులు ఉన్నారు. దాంట్లో 400 మంది జ‌ర్న‌లిస్టులు ఉన్నారు. ఆస్ట్రేలియాకు చెందిన నైన్ ఎంట‌ర్‌టైన్మెంట్‌లో భాగ‌మైన స్టఫ్ సంస్థ‌ను సీఈవో సినియాబ్ బౌచ‌ర్ ఒక డాల‌ర్‌కు కొనేశారు. అయితే ఈ కొనుగోలు ఒప్పందం నెల రోజుల్లో పూర్తికానున్న‌ట్లు స‌మాచారం. ఉద్యోగుల‌కు త‌మ కంపెనీలో వాటా ఇవ్వాల‌న్న‌దే త‌మ ఉద్దేశ‌మ‌ని ఈ సంద‌ర్భంగా బౌచ‌ర్ తెలిపారు. 


logo