గురువారం 04 జూన్ 2020
International - May 20, 2020 , 21:17:16

ఉద్యోగం పోతే పోయింది.. లాటరీ తగిలింది

ఉద్యోగం పోతే పోయింది.. లాటరీ తగిలింది

న్యూజీలాండ్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా ప్రపంచదేశాలు లాక్‌డౌన్‌ చేపట్టి కట్టడికి తీవ్రంగా కృషిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నో విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు మూతపడ్డాయి. చాలా మంది వర్క్‌ ఫ్రం హోం ద్వారా ఉద్యోగాలను వెలగబెట్టారు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పలు సంస్థలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించే పని చేపట్టాయి. న్యూజిలాండ్‌కు చెందిన ఓ వ్యక్తికి కూడా ఉద్యోగం ఊడింది. అయితే ఆయన ఎప్పుడో తీసుకొన్న లాటరీ టికెట్‌ ఆయనకు అదృష్టాన్ని తీసుకొచ్చింది. 

ఉద్యోగం ఊడిపోగానే ఇంట్లో కూర్చుండి ఏంచేయాల అని అలోచిస్తున్న సమయంలో.. వెబ్‌సైట్లో లాటరీ ఫలితాలు కనిపించాయి. ఆతృతగా వెతగ్గా తనకు దాదాపు రూ.46 కోట్ల (10.3 న్యూజిలాండ్‌ డాలర్స్‌) ప్రైజ్‌ మనీ వచ్చింది. ఈ విషయాన్ని మైలోటో కస్టమర్ సపోర్ట్‌ కూడా స్పష్టంచేసింది. భార్య ఇంటికి రాగానే లాటరీ తగిలిన విషయం  చెప్పి.. ఆమెను సర్‌ప్రైజ్‌ చేశాడు. ఇప్పటికీ తమకు నమ్మలేనట్లుగానే ఉన్నదని ఆ వ్యక్తి భార్య చెప్తున్నది. లాటరీలో వచ్చిన డబ్బుతో పాతబడిన కారును ముందుగా రిపేరింగ్‌ చేయించుకోవాలని, అనంతరం మిగిలిన డబ్బుతో పిల్లలకు మంచి చదువులు చెప్పించాలని నిర్ణయించుకొన్నట్టు ఆమె పేర్కొన్నారు. 


logo