ఆదివారం 27 సెప్టెంబర్ 2020
International - Aug 13, 2020 , 19:43:38

న్యూజీలాండ్‌లో 17కు పెరిగిన కరోనా కేసులు

న్యూజీలాండ్‌లో 17కు పెరిగిన కరోనా కేసులు

వెల్లింగ్టన్‌ : న్యూజీలాండ్‌లోని అతిపెద్ద నగరంలో కరోనా కేసులు గురువారం 17కి పెరిగాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఇప్పటికే ఆక్లాండ్‌లో లాక్‌డౌన్‌ అమలులోకి వచ్చింది. 102 రోజుల వరకు ఈ దక్షిణ పసిఫిక్‌ దేశంలో ఒక్క కేసు నమోదు కాలేదు. దీంతో జనజీవనం సాధారణ స్థితికి వచ్చింది. క్రీడా స్టేడియాలు, రెస్టారెంట్లు జనంతో సందడిగా కనిపించగా, పాఠశాలలు  సైతం తెరుచుకున్నాయి.  మూడు నెలల కాలంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణీకులను క్వారంటైన్‌ చేశారు. ఈ క్రమంలో ఈ వారం మొదట్లో ఆరోగ్య కార్యకర్తలు ఆక్లాండ్‌లో ఓ కుటుంబానికి చెందిన నలుగురికి వైరస్‌ లక్షణాలను గుర్తించారు. దీంతో వైరస్‌ మూలాన్ని కనుగొనే  పనిలో అధికారులు ఉన్నారు. సరిహద్దులో పట్టుబడిన ఏ ఇన్ఫెక్షన్లతోనూ జన్యు పరీక్ష ఫలితాలు కొత్త క్లస్టర్‌ కేసులతో సరిపోలలేదని డైరెక్టర్‌ జనరల్‌ ఆష్లే బ్లూమ్‌ఫీల్డ్ తెలిపారు.

అయితే వైరస్ ఆస్ట్రేలియా, బ్రిటన్‌ నుంచి వచ్చి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. బుధవారం ఆక్లాండ్‌లో అధికారులు లెవల్‌-3 హెచ్చరికలు జారీ చేయగా బార్లు, రెస్టారెంట్లు, చాలా వ్యాపారాలు మూతపడ్డాయి. దేశంలోని మిగతా ప్రాంతాల్లో లెవల్‌-2 హెచ్చరిక జారీ చేశారు. ఇందులో ప్రజలు సామాజిక దూరం పాటించాల్సి ఉంటుంది. కొత్త కేసుల దృష్టా ఆక్లాండ్‌లో లాక్‌డౌన్‌ పొడించాలా? వద్దా? అనేదానిపై ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకోనుంది. తాజాగా గుర్తించిన 13 కేసుల గురించి ఆరోగ్య అధికారులకు శుభవార్త ఏమిటంటే వీటన్నింటిని నాలుగు కేసులతోనే ముడిపడి ఉండవచ్చని, సమాజ వ్యాప్తికి ఇంకా ఆధారాలు లభించలేదు.  బుధవారం కేవలం 6వేల మందికిపైగా పరీక్షలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. వైరస్‌కు సంబంధించిన చిక్కులను గుర్తు చేస్తూ, ఎంత సులభంగా విస్తరిస్తుందో ప్రధాని జెసిండా ఆర్డర్న్‌ గుర్తు  చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు.

కొత్త కేసుల్లో పాజిటివ్‌తో దేశానికి చేరుకున్న వారికి క్వారంటైన్‌ ఫెసిలిటీ, ఎయిర్‌పోర్ట్‌, నౌకాశ్రాయల వద్ద పని చేసే వారితో ముడిపడి ఉంటాయని ఊహిస్తున్నట్లు బ్లూమ్ ఫీల్డ్ తెలిపారు. వైరస్‌ సోకిన వారిలో కొందరు.. ఆక్లాండ్‌ శీతలీకరణ ఆహార సంస్థలలో పని చేస్తున్నారు. వైరస్‌ నుంచి విదేశాల నుంచి శీతలీకరించిన ఆహారంలో జీవించి ఉంటుందనే ఊహాగానాలకు దారి తీసింది. ఫెసిలిటీ సెంటర్‌ను పరీక్షిస్తున్నామని, వైరస్‌ ఒకరి నుంచి మరో వ్యక్తికి వ్యాప్తి చెందే అవకాశం తక్కువగా ఉందని బ్లూమ్ ఫీల్డ్ పేర్కొన్నారు. ఒక వ్యక్తికి ఒకసారి వైరస్‌ వ్యాప్తి చెందేందుకు చల్లని వాతావరణం సహాయపడి ఉండవచ్చని ప్రధాని ఆర్డర్న్‌ పేర్కొన్నారు. వైరస్‌ వ్యాప్తి ఘటన కేసులను గుర్తించడంలో కొంత ఆలస్యం కావడం.. న్యూజీలాండ్‌ చుట్టు పక్కన ఉన్న టాయిలెట్ పేపర్, పిండి వంటి ముఖ్యమైన వస్తువులు సూపర్‌మార్కెట్లలో కొనుగోలు చేసిన వారిని  కొంత భయాందోళనలకు గురిచేసింది.

న్యూజీలాండ్ మొదటి సారిగా వైరస్‌ వ్యాప్తిని మార్చి చివరలో గుర్తించి కఠినంగా నిబంధనలు విధించింది. అప్పుడు సుమారు 100 పాజిటివ్‌ కేసులను మాత్రమే గుర్తించారు. ఈ క్రమంలో  ప్రధాని జెసిండా ఆర్డర్న్ నాయకత్వానికి విస్తృతంగా ప్రశంసలు లభించాయి. వచ్చే నెలలో జరుగబోయే సార్వత్రిక ఎన్నికల ముందు ఒపీనియన్ పోల్స్ ఆమె నాయకత్వం వహిస్తున్న లిబరల్ లేబర్ పార్టీకి మద్దతు పెరిగింది. వైరస్‌ సంక్రమణ క్రమంలో ఎన్నికలు ప్రణాళికా ప్రకారం సాగుతాయా? లేదా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. న్యూజిలాండ్ చట్టం ప్రకారం.. ఆర్డర్న్ రెండు నెలల వరకు ఎన్నికలు వాయిదా వేయవచ్చు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.logo