బుధవారం 27 మే 2020
International - May 07, 2020 , 17:42:44

115 ఏండ్ల చరిత్రలో తొలిసారి మూత

115 ఏండ్ల చరిత్రలో తొలిసారి మూత

న్యూయార్క్‌: కరోనా వైరస్‌ మహమ్మారి విస్తరించిన కారణంగా 115 ఏండ్ల చరిత్రలో తొలిసారి న్యూయార్క్‌లోని సబ్‌వే రైలు సేవలు నిలిచిపోయాయి. గత మార్చి నుంచి తగ్గిన షెడ్యూళ్లలో నడుస్తున్న సబ్‌వే రైళ్లు.. శుభ్రపరచడం, శానిటైజ్‌ చేయడం  కోసం  రాత్రి వేళల్లో సర్వీసులను నిలిపివేస్తున్నట్లు మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ (ఎంటీఏ) ప్రకటించింది. అర్ధరాత్రి 1 గంట నుంచి ఉదయం 5 గంటల వరకు సబ్‌వే సేవలు ఉండవని వెల్లడించింది. 

నిత్యం  50 లక్షల మంది ప్రయాణికులకు సబ్‌వే రైలు సేవలను అందిస్తున్నది. న్యూయార్క్‌ సబ్‌వే రైల్వే వ్యవస్థ అమెరికా అతిపెద్ద రవాణా  వ్యవస్థగా పేరుగాంచింది. రాత్రివేళల్లో పలువురు నిరాశ్రయులు రైల్వే బోగీల్లో నిద్రపోయి మృత్యువాతకు గురైనట్లు ప్రచారం  జరుగడంతో సబ్‌వే మొత్తాన్ని లోతైన పరిశుభ్రత చేపట్టాలని ఎంటీఏ నిర్ణయించింది.


logo