గురువారం 09 జూలై 2020
International - Jun 23, 2020 , 12:27:22

నల్లజాతీయుడి మెడ పట్టుకున్న పోలీస్‌ అధికారి సస్పెండ్‌

నల్లజాతీయుడి మెడ పట్టుకున్న పోలీస్‌ అధికారి సస్పెండ్‌

న్యూయార్క్‌: ఓ నల్లజాతీయుడి మెడ పట్టుకున్న ఒక పోలీస్‌ అధికారిపై సస్పెషన్‌ వేటు పడింది. అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. మే 25న నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్‌ను అరెస్ట్‌ చేసే క్రమంలో ఓ పోలీస్‌ అధికారి అతడ్ని కిందపడేసి మోకాలితో గొంతును నొక్కడంతో అతడు మరణించిన సంగతి తెలిసిందే. దీంతో అమెరికా వ్యాప్తంగా నల్లజాతీయుల నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ఓ వంతెన వద్ద ఉన్న ముగ్గురు నల్లజాతీయులను అక్కడి నుంచి వెళ్లిపోవాలని న్యూయార్క్‌ పోలీసులు హెచ్చరించారు. 

అయితే వారు అక్కడి నుంచి వెళ్లకపోగా పోలీసులను తిట్టారు. దీంతో ఆగ్రహించిన ఓ పోలీస్‌ అధికారి ఒక నల్లజాతీయుడి మెడను గట్టిగా నొక్కి పట్టుకున్నాడు. దీంతో ఊపిరి ఆడక అతడు అస్వస్థతకు గురయ్యాడు. పోలీస్‌ల వద్ద ఉన్న కెమెరాలో రికార్డైన ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీనిపై స్పందించిన న్యూయార్క్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ దుర్మోట్ షీ ఆ పోలీస్‌ అధికారిని సస్పెండ్‌ చేసి ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ట్వీట్‌ చేశారు. కాగా, పోలీసుల పట్ల ఆ ముగ్గురు ప్రవర్తించిన తీరును కూడా ఆయన తప్పుపట్టారు. logo