గురువారం 21 జనవరి 2021
International - Dec 14, 2020 , 21:00:39

అమెరికాలో తొలి కొవిడ్‌ టీకా తీసుకున్న నర్సు

అమెరికాలో తొలి కొవిడ్‌ టీకా తీసుకున్న నర్సు

న్యూయార్క్: కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను సోమవారం అందుకున్న మొదటి వ్యక్తి న్యూయార్క్‌లోని ఒక నర్సు సాండ్రా లిండ్సే నిలిచారు. లాంగ్ ఐలాండ్ యూదు మెడికల్ సెంటర్‌లో క్రిటికల్ కేర్ విభాగంలో సాండ్రా లిండ్సే ఉదయం 9:30 గంటలకు ఫైజర్-బయోఎంటెక్ షాట్‌ను అందుకున్నారు. ఈ విషయాన్ని స్థానిక టెలిజన్లో ప్రత్యక్షప్రసారం చేశారు. "మొదటి వ్యాక్సిన్ నిర్వహించబడింది. కంగ్రాట్స్‌  అమెరికా! కంగ్రాట్స్‌ వరల్డ్!" అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు.

"అమెరికాలో కరోనా తొలి వ్యాక్సిన్‌ను తీసుకోవడం గొప్పగా భావిస్తున్నాను. నాకు ఉపశమనం కలుగుతుంది" అని నర్సు సాండ్రాలిండ్సే చెప్పారు. ఇది అమెరికా చరిత్రలో చాలా బాధాకరమైన సమయం ముగిసినట్లుగా సూచిస్తుందని నమ్ముతున్నానన్నారు. టీకా సురక్షితం అని ప్రజల విశ్వాసాన్ని కలిగించాలనుకుంటున్నాను అని తెలిపారు. వీడియో-లింక్ ద్వారా ల్యాండ్‌ మార్క్‌ మూవ్‌మెంట్‌ను వీక్షిస్తున్న గవర్నర్ ఆండ్రూ క్యూమో..  ఈ టీకా తనకు, ఇతర ఫ్రంట్‌లైన్ ఆరోగ్య సంరక్షణ కార్మికులకు భద్రత ఇస్తుందని ఆశిస్తున్నానని లిండ్సేతో చెప్పారు. 

ప్రజలకు వ్యాక్సిన్‌ చేరడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. అప్పటివరకు నిర్ణీత దూరంతోపాటు మాస్కులను ధరించడం వంటి మార్గదర్శకాలను అనుసరించాలని అమెరికా ప్రభుత్వం ప్రజలకు సూచిస్తున్నది. న్యూయార్క్ రాష్ట్రంలో 35,000 మందితోపాటు అమెరికా మొత్తం మీద 2,99,000 ఈ వైరస్ బారిన పడ్డారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo