సోమవారం 30 మార్చి 2020
International - Mar 04, 2020 , 16:01:01

ఈ ఇళ్ల ఫొటోలను చూశారా..?

ఈ ఇళ్ల ఫొటోలను చూశారా..?

సాధారణంగా శీతల ప్రాంతాల్లో ఇళ్లు మంచుతో కప్పబడిన దృశ్యాలను చూస్తుంటాం. న్యూయార్క్‌లో కూడా అలాగే కొన్ని ఇళ్ల సమూహం మంచుతో చుట్టేయబడింది. హంబర్గ్‌లోని లేక్‌ ఎరీ సరస్సు తీరంలోని హూవర్‌ బీచ్‌ వెంబడి ఉన్న ఇళ్లు మంచుతో చుట్టచుట్టలుగా ఉండలు తిరుగుతూ దారపు పోగుల్లాగా కప్పివేయబడ్డాయి. ఇళ్ల కిటికీలు, తలుపులు ఇతర సామాగ్రి అంతా మంచుమయమైపోయాయి. అక్కడి వాసులు చేసేదేమి లేక వచ్చి రాని వెలుతురు ఉన్న ఆ ఇండ్లలో బిక్కుబిక్కుంటూ గడుపుతున్నారు. గతంలో కూడా మంచు ఆవహించడాన్ని చూశాం. కానీ ఈ ఏడాది మాత్రం మంచు తాకిడి మరింత ఉధృతంగా ఉందని హూవర్‌బీచ్‌లోని ఉన్న ఓ ఇంటి యజమాని ఎడ్‌మిస్‌ అన్నారు.


logo