బుధవారం 03 జూన్ 2020
International - Apr 28, 2020 , 10:00:23

బ్రిట‌న్‌లో కొత్త టెన్ష‌న్‌...

బ్రిట‌న్‌లో కొత్త టెన్ష‌న్‌...

లండ‌న్‌ క‌రోనాతో ఇప్ప‌టికే స‌త‌మ‌త‌మ‌వుతున్న బ్రిట‌న్‌కు మ‌రో కొత్త చిక్కు వ‌చ్చిప‌డింది. అక్క‌డ గత కొన్ని రోజులుగా చిన్నారులు   అంతుచిక్క‌ని అనారోగ్యం బారిన ప‌డుతున్నారు. చిన్నారుల్లో కడుపు నొప్పి, గుండెలో వాపు లాంటి ప్రమాదకర లక్షణాలు కనిపిస్తుండడంతో ప్రత్యేకంగా ఐసీయూల్లో ఉంచి చికిత్స చేయాల్సి వస్తోంది. మొద‌ట‌ ఈ లక్షణాలు కరోనా వైరస్‌కు సంబంధించినవేనని అనుకున్నారు.కానీ.. కరోనా సోకని చిన్నారుల్లోనూ ఇవి కనిపిస్తుండడంతో నేషనల్ హెల్త్ సర్వీస్ అప్రమత్తమైంది.  ఇలాంటి లక్షణాలు కనుక పిల్లల్లో కనిపిస్తే వెంటనే ఆసుపత్రుల్లో చేర్చాలని కోరింది. చిన్నారుల్లో ‘టాక్సిక్ షాక్ సిండ్రోమ్’ వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని, రక్త నాళాల్లో వాపు కనిపించే వ్యాధి లక్షణాలు కూడా కొంచెం బయటపడుతున్నాయని పేర్కొంది. గత మూడు వారాలుగా దేశవ్యాప్తంగా పలువురు చిన్నారులు ఈ లక్షణాలతో ఆసుపత్రులలో చేరుతుండడాన్ని గుర్తించినట్టు ఎన్‌హెచ్ఎస్ పేర్కొంది.


logo