e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, October 22, 2021
Home News మాన‌వుల‌తో శృంగారం వ‌ల్లే నియాండెర్త‌ల్స్ అంత‌రించారు..

మాన‌వుల‌తో శృంగారం వ‌ల్లే నియాండెర్త‌ల్స్ అంత‌రించారు..

శాన్‌ఫ్రాన్సిస్‌కో: ఆదిమ జాతి నియాండెర్త‌ల్స్ అంత‌రించిపోవ‌డానికి ప‌రిశోధ‌కులు కొత్త కార‌ణం చెప్పారు. మాన‌వుల‌తో శృంగారం చేయ‌డం వ‌ల్ల నియాండెర్త‌ల్ జాతి క‌నుమ‌రుగైన‌ట్లు ఓ అధ్య‌య‌నం తేల్చింది. శాన్ ఫ్రాన్సిస్‌కోకు చెందిన పీఎల్ఓఎస్ జ‌ర్న‌ల్‌లో ఆ విష‌యాన్ని ప‌బ్లిష్ చేశారు. ప్రాచీన మాన‌వులు నియాండెర్త‌ల్స్‌లో ఉన్న అరుదైన ర‌క్త‌పు వ్యాధి వ‌ల్ల ఆ జాతి అంతరించిపోయి ఉంటుంద‌ని భావిస్తున్నారు. మాన‌వులకు, నియాండెర్త‌ల్స్ మ‌ధ్య జ‌రిగిన శారీర‌క సంబంధాల వ‌ల్లే ఈ ఉప‌ద్ర‌వం ఎదురైన‌ట్లు అంచ‌నా వేస్తున్నారు.

నియాండెర్త‌ల్స్ ర‌క్తంలో ప్ర‌త్యేక‌మైన జ‌న్యువు వేరియంట్లు ఉన్నాయ‌ని, ఆ జ‌న్యువుల వ‌ల్ల హీమోలైటిక్ వ్యాధి సోకే ప్ర‌మాదం ఉంద‌న్నారు. అంటే గ‌ర్భం ధ‌రించిన నియాండెర్త‌ల్స్ తో పాటు కొత్త‌గా జ‌న్మించిన వారిలో ఆ వ్యాధి సంక్ర‌మిస్తూ పోవ‌డం వ‌ల్ల ఆ జాతికి స‌మ‌స్య వ‌చ్చిన‌ట్లు భావిస్తున్నారు. హెచ్‌డీఎఫ్ఎన్ వ్యాధి వ‌ల్ల తీవ్ర ర‌క్త‌హీన‌త వ‌స్తుంద‌ని.. అయితే ప‌దేప‌దే ఆ జ‌న్యువు మ్యుటేట్ కావ‌డం వ‌ల్ల అది మ‌రింత బ‌లహీన‌ప‌డిన‌ట్లు అంచ‌నా వేశారు. దాని వ‌ల్లే నియాండెర్త‌ల్స్ పిల్ల‌ల సంఖ్య త‌గ్గి.. క్ర‌మం వారి జాతి న‌శించ‌డానికి కార‌ణ‌మై ఉంటుంద‌ని ఆ జ‌ర్న‌ల్‌లో పేర్కొన్నారు. 40 వేల ఏళ్ల క్రితం యురేసియా ప్రాంతంలో నియాండెర్త‌ల్స్ జీవించి ఉంటార‌ని చ‌రిత్ర‌కారులు చెబుతుంటారు.

- Advertisement -

నియాండెర్త‌ల్స్‌తో పాటు డెనిసోవ‌న్స్‌కు చెందిన బ్ల‌డ్ గ్రూపు వ్య‌వ‌స్థ‌ను విశ్లేషించారు. వారి పుట్టుక‌, వ్యాప్తితో పాటు హోమో సేపియ‌న్స్‌తో జ‌రిగిన సంగ‌మాల గురించి కూడా తాజా జ‌ర్న‌ల్ రిపోర్ట్‌లో తెలిపారు. సెక్సువ‌ల్ రిలేష‌న్‌షిప్ వ‌ల్లే నియాండెర్త‌ల్స్ అంత‌రించిన‌ట్లు భావిస్తున్నా.. ప్ర‌ధానంగా హోమో సేపియ‌న్స్‌తో జ‌రిగిన లైంగిక సంబంధాల వ‌ల్లే వాళ్లు క‌నుమ‌రుగైన‌ట్లు రిపోర్ట్‌లో తెలిపారు. నిజానికి ఆ ర‌క్త స‌మ‌స్య ప్ర‌స్తుతం మాన‌వుల్లో లేదు. కానీ నియాండెర్త‌ల్ జాతి మ‌నుషుల్లో ర‌క్త‌హీన‌త స‌మ‌స్య ఎక్కువ‌గా ఉన్న‌ట్లు అనుమానిస్తున్నారు. ర‌క్త‌హీన‌త‌కు సంబంధించిన వ్యాధి పిండ ద‌శ నుంచే ఆవిర్భ‌విస్తుంద‌ని, అయితే అలాంటి కేసులు సుమారు 50 వేల ఏళ్ల క్రితం ఉన్న‌ట్లు ప‌రిశోధ‌కులు భావిస్తున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement