మంగళవారం 14 జూలై 2020
International - Jun 30, 2020 , 11:35:48

పొంచి ఉన్న‌ మరో వైర‌స్‌.. బాంబు పేల్చిన 'చైనా'!

పొంచి ఉన్న‌ మరో వైర‌స్‌.. బాంబు పేల్చిన 'చైనా'!

హైద‌రాబాద్‌:  క‌రోనా వైర‌స్ భ‌యం తొల‌గ‌క‌ముందే.. చైనా ప‌రిశోధ‌కులు మ‌రో బాంబును పేల్చారు.  మ‌హ‌మ్మారిగా మారే ప్ర‌మాదం ఉన్న ఓ కొత్త ఫ్లూ వైర‌స్‌ను గుర్తించిన‌ట్లు చెప్పారు.  ఆ వైర‌స్‌ను పందులు క్యారీ చేస్తున్న‌ట్లు వారు అంచ‌నా వేస్తున్నారు.  ఆ ప్ర‌మాద‌క‌ర వైర‌స్ మాన‌వుల‌ను కూడా సంక్ర‌మించే అవ‌కాశం ఉంద‌న్నారు. ఆ కొత్త వైర‌స్ వేగంగానే మార్పు చెందుతున్న‌ద‌ని,  క‌రోనా త‌ర‌హాలోనే ఆ వైర‌స్ కూడా మ‌నిషి నుంచి మ‌నిషికి సోకుతుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు హెచ్చ‌రించారు.  ఆ వైర‌స్ నుంచి త‌క్ష‌ణ‌మే స‌మ‌స్య లేకున్నా.. అది కొత్త వైర‌స్ కావ‌డం వ‌ల్ల ఇమ్యూనిటీ స‌మ‌స్య ఏర్ప‌డే అవ‌కాశాలు ఉన్నాయ‌న్నారు.

కొత్త ఫ్లూ వైర‌స్‌ను G4 EA H1N1గా పిలుస్త‌న్నారు.  2009లో వ‌చ్చిన స్వైన్ ఫ్లూకు ద‌గ్గ‌ర‌గా ఈ ఫ్లూ ఉన్న‌ట్లు గుర్తించారు. వైర‌స్‌ను అడ్డుకోవాలంటే.. పందుల‌ను నియంత్రించాల‌ని శాస్త్ర‌వేత్త‌లు పిలుపునిచ్చారు. ప్రొసీడింగ్స్ ఆఫ్ ద నేష‌న‌ల్ అకాడ‌మీ ఆఫ్ సైన్సెస్ జ‌ర్న‌ల్‌లో ఈ కొత్త వైర‌స్ గురించి ప్ర‌చురించారు. బ్రిట‌న్‌కు చెందిన ప్రొఫెస‌ర్ కిన్ చౌ చాంగ్ త‌న స‌హ‌చ‌రుల‌తో క‌లిసి ఈ కొత్త వైర‌స్‌పై స్ట‌డీ చేశారు.  


 


 


logo