శనివారం 06 జూన్ 2020
International - Apr 29, 2020 , 16:06:13

మీ అబ‌ద్ధాలు మితిమీరాయి

మీ అబ‌ద్ధాలు మితిమీరాయి

భార‌త్‌లో మ‌త స్వేచ్ఛ‌కు ప్ర‌మాదం ఏర్పడింద‌న్న అమెరికా ఆరోప‌ణ‌లపై మ‌న‌దేశం తీవ్రంగా స్పందించింది. అబ‌ద్ధాలు సృతిమించాయ‌ని మండిప‌డింది. వివిధ దేశాల్లో మ‌త స్వేచ్ఛ‌ను ప‌రిశీలించే అమెరికాకు చెందిన యూఎస్‌సీఐఆర్ ఎఫ్ సంస్థ మ‌త స్వేచ్ఛ త‌క్కువ‌గా ఉన్న 14 దేశాల పేర్ల‌ను మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించింది. అందులో బ‌ర్మా, చైనా, ఎరిత్రియా, ఇరాన్‌, నైజీరియా, ఉత్త‌ర‌కొరియా, ర‌ష్యా, పాకిస్థాన్‌, సౌదీ అరేబియా, సిరియా, త‌జ‌కిస్థాన్‌, తుర్క్‌మెనిస్థాన్, వియ‌త్నాంతోపాటు భార‌త్‌ను కూడా చేర్చింది. ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టంతోటు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను ఈ సంద‌ర్భంగా ఆ సంస్థ త‌ప్పుబ‌ట్టింది. అమెరికా సంస్థ నివేదిక‌పై భార‌త్ తీవ్ర అభ్యంత‌రం తెలిపింది. ఈ అబ‌ద్ధాలు తారాస్థాయికి చేరాయ‌ని విదేశాంగ‌శాఖ ప్ర‌తినిధి అనురాగ్ శ్రీ‌వాత్స‌వ మండిప‌డ్డారు. 


logo