సోమవారం 06 జూలై 2020
International - Jun 26, 2020 , 14:36:43

కోట్ల‌ విలువ చేసే కారు.. కొన్న 20 నిమిషాల‌కే నుజ్జునుజ్జు!

కోట్ల‌ విలువ చేసే కారు.. కొన్న 20 నిమిషాల‌కే నుజ్జునుజ్జు!

కొన్ని భ‌యంక‌ర‌మైన సంఘ‌ట‌న‌లు పీడ‌క‌ల అయితే ఎంత బాగుంటుందో అని అనుకున్న సంద‌ర్భాలెన్నో. జూన్ 24 ఇంగ్లాండ్‌లో జ‌రిగిన కార్ యాక్సిడెంట్ కూడా క‌ల అయితే బాగుండు అనుకోవ‌చ్చు య‌జ‌మాని. ఇక్క‌డ మ‌నిషి ప్రాణాల గురించి బాధ‌ప‌డ‌ట్లేదు. 1.9 కోట్ల విలువ చేసే లంబోర్ఘిని కారును షో రూం నుంచి అలా తిరిగొద్దాం అని బ‌య‌ట‌కి వ‌చ్చారు. ఏదో మెకానిక‌ల్ ప్రాబ్ల‌మ్ వ‌చ్చింద‌ని రోడ్డు ప‌క్క‌న ఆపుకున్నారు. ఇంత‌లో ఒక వాహ‌న‌దారుడు వ‌చ్చి కారును ఢీ కొట్టాడు.

క్ష‌ణాల్లో కొత్త కారు నుజ్జు నుజ్జు అయిపోయింది. ఈ సంఘ‌ట‌న‌ను వెస్ట్ యార్క్ షైర్ పోలీస్‌-రోడ్స్ పోలీసింగ్ యూనిట్ దెబ్బ‌తిన్న లంబోర్ఘిని చిత్రాల‌ను ట్విట‌ర్‌లో పోస్ట్ చేశారు. "ఈ రోజు M1 ఒసెట్ - ఇది ఒక కారు మాత్రమే! కానీ ఈ సందర్భంగా, లేన్ 3లో యాంత్రిక వైఫల్యం కారణంగా ఆగిపోయిన 20 నిమిషాల పాత సరికొత్త  లంబోర్ఘిని ఒక అమాయక వాహనదారుడి వెనుక నుండి ఢీ కొట్టింది'‌ అనే శీర్షిక‌ను పోలీస్ యూనిట్‌ జోడించారు. ఒక నివేదిక ప్ర‌కారం వ్యాన్ డ్రైవ‌ర్ త‌ల‌కు గాయాల‌య్యాని తెలిపింది. ఇక‌పోతే లంబోర్ఘిని య‌జ‌మాని ఎవ‌రో తెలియాల్సి ఉంది. 

 


logo