శుక్రవారం 23 అక్టోబర్ 2020
International - Sep 26, 2020 , 16:37:24

యూఎస్ సుప్రీంకోర్టులో కొత్త న్యాయమూర్తి : రూత్‌ స్థానంలో అమీ కోన్ బారెట్‌

యూఎస్ సుప్రీంకోర్టులో కొత్త న్యాయమూర్తి : రూత్‌ స్థానంలో అమీ కోన్ బారెట్‌

వాషింగ్టన్‌ : అమెరికా సుప్రీంకోర్టులో అమీ కోన్ బారెట్‌ను న్యాయమూర్తిగా నియమించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు. ఇవాళ గానీ రేపు గానీ అధికారిక ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. దివంగత న్యాయమూర్తి జస్టిస్ రూత్ బాడర్ గిన్స్బర్గ్ స్థానంలో అమీ నియమితులవుతారు. కొత్త న్యాయమూర్తి నియామకాన్ని ప్రతిపక్ష డెమోక్రాట్ పార్టీ, దాని అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ వ్యతిరేకిస్తున్నారు.

అమీ కోన్‌ బారెట్‌ని సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా మార్చడానికి ట్రంప్‌కు ఇప్పుడు సెనేట్ అనుమతి అవసరం. రిపబ్లికన్ పార్టీలో మెజారిటీ ఉన్నందున సాంకేతికంగా ఇది కష్టం కాదు. ఎన్నికలకు కొద్ది వారాలు మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. అమీ పేరును ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించవచ్చు. ట్రంప్‌కు చెందిన కొందరు సీనియర్ అధికారులు వరుసగా రెండు రోజులుగా అమీతో సంప్రదింపులు జరిపినట్లుగా తెలుస్తున్నది. శుక్రవారం అమీ నియమాకం గురించి ట్రంప్‌ను ప్రశ్నించినప్పుడు.. ప్రత్యక్ష సమాధానం ఇవ్వకుండా దాటవేశారు. కొన్ని నెలలుగా అధ్యక్ష ఎన్నికల రేసులో వెనుకబడి ఉన్న ట్రంప్.. అమీ కోన్‌ బారెట్‌ పేరు నుంచి ప్రయోజనం పొందవచ్చని నిపుణులు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అమెరికా చరిత్రలో ఇంతకు ముందెన్నడూ ఇలాంటి నియామకం జరుగలేదని తెలుస్తున్నది. అధ్యక్ష ఎన్నికలకు 39 రోజుల ముందు ప్రభుత్వం కొత్త న్యాయమూర్తి పేరును ఖరారు చేసింది. సాధారణంగా, ఎన్నికల సంవత్సరంలో జూలై తరువాత సుప్రీంకోర్టు న్యాయమూర్తిని నియమించరు. అయితే, ట్రంప్ ఈ సంప్రదాయాన్ని పక్కనబెట్టారు. నాలుగేండ్ల క్రితం బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు న్యాయమూర్తిని నియమించాలని ఆయన ప్రతిపాదించారు. కానీ, అప్పుడు రిపబ్లికన్లు దీనిని రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రకటించారు. 

రూత్‌ స్థానాన్ని పూరించడం కష్టం

అమీ కోన్‌ బారెట్‌ను నియమించిన పక్షంలో గర్భస్రావం చట్టంలో మార్పులు కోరుతూ ఉద్యమాన్ని ప్రభావితం చేయవచ్చు. అయితే, మహిళల హక్కుల కోసం పెద్ద గొంతు వినిపించిన దివంగత జస్టిస్ గిన్స్బర్గ్ రూత్‌ స్థానాన్ని నింపడం అమీకి అంత సులభం కాదని పరిశీలకులు భావిస్తున్నారు. అమెరికా సుప్రీంకోర్టులో 9 మంది న్యాయమూర్తులు ఉన్నారు. ఒక ముఖ్యమైన నిర్ణయం సమయంలో వారి అభిప్రాయాన్ని 4-4 గా విభజిస్తే.. ప్రభుత్వం నియమించిన న్యాయమూర్తి ఓటు నిర్ణయాత్మకంగా మారుతుంది. న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమించినందున.. అతను ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయం ఇస్తారని నమ్ముతారు. కాగా, కొత్త న్యాయమూర్తిని ట్రంప్‌ నియమించడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.


logo