శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
International - Jan 23, 2021 , 01:22:12

చచ్చుబడిన కాళ్లలో మళ్లీ కదలికలు!

చచ్చుబడిన కాళ్లలో మళ్లీ కదలికలు!

బెర్లిన్‌: చచ్చుబడిన కాళ్లలో మళ్లీ కదలికలు రప్పించారు జర్మనీ పరిశోధకులు. ఎలుకలపై చేసిన ఈ ప్రయోగం విజయవంతమైనది. వెన్నెముక గాయాలతో కిందిభాగం చచ్చుబడిపోయి మంచానికే పరిమితమైనవారిని మనం చూస్తుంటాం. కండరాల నుంచి మెదడుకు సమాచారం పంపే నాడీకణాలు తిరిగి వృద్ధిచెందక పోవటమే ఇందుకు కారణం. అయితే రుహర్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఒక కృత్రిమ ప్రొటీన్‌తో దీన్ని అధిగమించారు. చచ్చుబడిపోయిన ఎలుకను మూడు వారాల్లోనే నడిచేలా చేశారు. మనుషులపై కూడా ప్రయోగాలు జరుపుతామని, అయితే ఇందుకు చాలా ఏండ్లు సమయం పడుతుందని చెప్పారు. 

VIDEOS

logo