బుధవారం 23 సెప్టెంబర్ 2020
International - Sep 14, 2020 , 14:10:02

క‌రోనా వైర‌స్ కొత్త ఫోటోల‌ను రిలీజ్‌చేసిన శాస్త్ర‌వేత్త‌లు!

క‌రోనా వైర‌స్ కొత్త ఫోటోల‌ను రిలీజ్‌చేసిన శాస్త్ర‌వేత్త‌లు!

ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా వైర‌స్ ఎలా ఉంటుంద‌నే విష‌యాన్ని కొన్ని ఫోటోలు చూసి తెలుసుకున్నారు. అయితే వీటికి భిన్నంగా ఉండే మ‌రో కొత్త క‌రోనా ఫోటోల‌ను న్యూ ఇంగ్లండ్ జ‌ర్న‌ల్ ఆఫ్ మెడిసిన్ రిలీజ్ చేశారు. అయితే.. శ్వాస‌కోశ క‌ణాల‌కు క‌రోనా సోకితే ఎలా ఉంటుందో ఫోటోలు తెలియ‌జేస్తున్నాయి. వీటిని స్కానింగ్ ఎల‌క్ట్రాన్ మైక్రోస్కోపీ విధానంలో శాస్త్ర‌వేత్త‌లు చిత్రాలు తీశారు.

క‌రోనా సోకిన 96 గంట‌ల త‌ర్వాత ఈ చిత్రాల‌ను చిత్రీక‌రించారు. ఇది వైరస్ కణాలు శరీరమంతటా పాకి, ఇతరులకు సంక్రమించేందుకు సిద్ధంగా ఉన్నాయన్న పరిస్థితిని కళ్లకు కట్టిన‌ట్లుగా చూపారు. ఈ ఫోటోలు మొద‌ట‌ బ్లాక్ అండ్ వైట్‌లో వ‌చ్చిన త‌ర్వాత వాటికి రంగుల‌ద్ది చిత్రాల‌ను విడుద‌ల చేశారు. ఈ క‌ణాలు మొద‌ట శ్వాస‌కోశ నాళాల్లోని శ్లేష్మంతో చేరి, వైరస్‌ల‌ను ఊపిరితిత్తుల నుంచి ఇతర శరీర భాగాలకు వ్యాపించేలా చేస్తాయని సైంటిస్టులు వెల్లడించారు. ఈ ఫోటోలు చూసి అయినా అంద‌రూ జాగ్ర‌త్త‌పడాలి అంటున్నారు శాస్త్ర‌వేత్త‌లు. logo