మంగళవారం 26 మే 2020
International - May 14, 2020 , 18:20:51

ఆ సమాచారం ఎత్తేస్తారా.. జరిమానా కడతారా..

ఆ సమాచారం ఎత్తేస్తారా.. జరిమానా కడతారా..

శాన్‌ఫ్రాన్సిస్కో: ఫ్రెంచ్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక కొత్త చట్టం ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, యూట్యూబ్‌, స్నాప్‌చాట్‌ లాంటి సోషల్‌ మీడియాకు చుక్కలు చూపిస్తున్నది. బుధవారం అమలులోకి తెచ్చిన కొత్త చట్టం ప్రకారం.. సోషల్‌ మీడియాలు తమ తమ వేదికల్లో పోస్ట్‌చేసే ఉగ్రవాదం, పెడోఫెలియాకు సంబంధించిన సమాచారాన్నిగంటలోగా ఎత్తేయని పక్షంలో కఠిన చర్యలు తప్పవు. ఈ మాధ్యమాలకు పెద్ద ఎత్తున జరిమానా విధించేలా చట్టంలో మార్పులు తీసుకొచ్చారు. 

సోషల్‌ మీడియాలో పోస్ట్‌ అయ్యే ఉగ్రవాదం, పెడోఫెలియాకు సంబంధించిన సమాచారాన్ని గంటలోగా ఆయా సంస్తలు తొలగించనిపక్షంలో.. ఆయా  సంస్థలకు గ్లోబల్‌ రెవెన్యూలో నుంచి  నాలుగు శాతం జరిమానా విధించనున్నారు. హానికరమైన సమాచారాన్ని తొలగించడంలో విఫలమయ్యే సోషల్ మీడియా సంస్థలపై భారీ జరిమానాలు విధించేలా రెగ్యులేటర్లకు అధికారం ఇస్తూ తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని ఆమోదించారు. ఫేస్‌బుక్‌లోని సమాచార్ని ఏడాదిపాటు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఫ్రెంచ్‌ ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చింది.


logo