ఆదివారం 12 జూలై 2020
International - Jun 02, 2020 , 07:26:32

కాంగోలో మరోమారు ఎబోలా వైరస్‌.. నలుగురు మృతి

కాంగోలో మరోమారు ఎబోలా వైరస్‌.. నలుగురు మృతి

హైదరాబాద్‌: ఆఫ్రికన్‌ దేశమైన కాంగోలో మరోమారు ఎబోలా వైరస్‌ బయటపడింది. దేశంలోని వంగాటా ప్రావిన్స్‌లో ఆరు ఎబోలా కేసులు గుర్తించామని ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇందులో ఆరుగురు మరణించారని, మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారని వెల్లడించింది. మొత్తంగా కాంగోలో ఇది 11వ ఎబోలా వైరస్‌ కేసు. దేశంలో 1976లో తొలిసారిగా ఎబోలాను గుర్తించారు. 

కరోనా వైరస్‌ ప్రజలు ఎదుర్కొంటున్న ముప్పు కాదని, అది కేవలం హెచ్చరిక మాత్రమేనని, ప్రస్తుత మన దృష్టి పూర్తిగా ఆ మహమ్మారిపై ఉన్నప్పటికీ, అనేక ఇతర ఆరోగ్య అత్యవసర పరిస్థితులను డబ్ల్యూహెచ్‌వో పర్యవేక్షించడంతోపాటు, ప్రతిస్పందిస్తుందని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ టెడ్రోస్‌ అధనామ్‌ అన్నారు.


logo