కరోనా కంటే ప్రాణాంతక రోగాల ముప్పు

కిన్షాసా: మానవాళికి కరోనా కంటే ప్రాణాంతకమైన రోగాల ముప్పు పొంచి ఉన్నదని ఒక వైద్య నిఫుణుడు హెచ్చరించారు. కొత్త వ్యాధికారకాలు వ్యాపించవచ్చని కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్కు చెందిన ప్రొఫెసర్ జీన్-జాక్వెస్ ముయెంబే టాంఫమ్ ఆందోళన వ్యక్తం చేశారు. 1976లో ఎబోలా వైరస్‌ను కనుగొనడంలో సహాయపడిన ఆయన తాజాగా సీఎన్ఎన్తో మాట్లాడారు. మనం ఇప్పుడు కొత్త వ్యాధికారకాలు బయటపడే ప్రపంచంలో ఉన్నామని చెప్పారు. ఈ రోగాలు కరోనా కంటే ప్రమాదకరంగా ఉంటాయా అన్న ప్రశ్నకు అవునని ఆయన సమాధానం చెప్పారు.
జంతువుల నుంచి మనుషులకు సోకే మరెన్నో జూనోటిక్ వ్యాధులు ప్రభలవచ్చని ప్రొఫెసర్ ముయెంబే హెచ్చరించారు. అలా వ్యాపించిన ఎల్లో ఫీవర్, రాబిస్ వంటి వైరస్ వ్యాధులలో కోవిడ్ 19 కూడా ఒకటని చెప్పారు. కాగా ఆయనతో మరి కొందరు శాస్త్రవేత్తలు హెచ్చరించిన కొత్త రకం వైరస్‌ను ‘డిసీజ్ ఎక్స్’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. ఎక్స్ అనే రోగం గురించి ఇప్పుడే ఊహించి చెప్పలేమని పేర్కొంది. ఎబోలా వైరస్‌ను పోలిన ఇది కరోనా మాదిరిగా ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన వ్యాధికి దారితీస్తుందని శాస్త్రవేత్తలు, ప్రజారోగ్య నిపుణులు హెచ్చరించినట్లు వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.తాజావార్తలు
- గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించిన బిగ్‌బాస్ ఫేమ్ మోనాల్
- బ్యాట్‌తో అలరించిన మంత్రి ఎర్రబెల్లి..!
- క్షిపణి సాంకేతికతలో ఆత్మనిర్భరత సాధించాం: వెంకయ్య నాయుడు
- నేపాల్ ప్రధాని ఓలి నివాసం వద్ద నిరసనలు
- రైతులకు మెరుగైన ఆఫర్ ఇచ్చాం : వ్యవసాయ మంత్రి
- ఇండియన్లపై వాట్సాప్ నిర్ణయం ఏకపక్షం: కేంద్రం
- కంటి ఆరోగ్యానికి కావాల్సిన విటమిన్లు తెలుసా..?
- శ్రద్దాదాస్ సొగసు చూడతరమా
- ఇంటికైనా మట్టికైనా మనోడే ఉండాలి
- రేపటి ర్యాలీకి సిద్ధమైన రైతుల ట్రాక్టర్లు