మంగళవారం 22 సెప్టెంబర్ 2020
International - Aug 11, 2020 , 14:09:25

అమెరికాలో స్కూలు విద్యార్థులకు కరోనా

అమెరికాలో స్కూలు విద్యార్థులకు కరోనా

వాషింగ్టన్: అమెరికాలో స్కూళ్లు తెరుచుకోవడంతో విద్యార్థులు కరోనా బారిన పడుతున్నారు. కరోనా నేపథ్యంలో మూసివేసిన స్కూళ్లను తెరువాల్సిందేనని ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. లేకపోతే పన్ను రాయితీలు రద్దు చేస్తామని హెచ్చరించారు. దీంతో జూలై నుంచి అమెరికా వ్యాప్తంగా స్కూళ్లు తెరుచుకుంటున్నాయి. కాగా జార్జియా, ఇండియానా, మిసిసిప్పీ నగరాల్లోని రద్దీ స్కూళ్లలో తొలి రోజే వందల సంఖ్యలో విద్యార్థులకు కరోనా సోకినట్లు వాషింగ్టన్ పోస్టు పేర్కొంది. దీంతో తమ పిల్లలను స్కూళ్లకు పంపడంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని వెల్లడించింది. జూలై చివరి రెండు వారాల్లో అమెరికాలో 97 వేలకుపైగా పిల్లలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లుగా పిల్లల ఆరోగ్య సంస్థలు విడుదల చేసిన నివేదికను వాషింగ్టన్ పోస్ట్ ప్రస్తావించింది.

మరోవైపు స్కూళ్లు తెరువాలన్న ట్రంప్ నిర్ణయాన్ని ఆ దేశంలోని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిలో ప్రపంచ దేశల్లో తొలిస్థానంలో ఉన్న అమెరికాలో ఇప్పటి వరకు అర కోటి మందికిపైగా ఆ దేశ ప్రజలకు కరోనా సోకగా 1,63,000 మందికిపైగా మరణించారు.

logo