శనివారం 30 మే 2020
International - Apr 23, 2020 , 09:56:09

వ‌రుస‌గా 6వ రోజూ చైనాలో మ‌ర‌ణాలు న‌మోదు కాలేదు..

వ‌రుస‌గా 6వ రోజూ చైనాలో మ‌ర‌ణాలు న‌మోదు కాలేదు..

హైద‌రాబాద్‌: చైనాలో క‌రోనా వైర‌స్ మ‌ర‌ణాలు వ‌రుస‌గా ఆరవ రోజు కూడా న‌మోదు కాలేదు.  బుధ‌వారం కేవ‌లం ప‌ది కొత్త పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.  దాంట్లో ఆరు మంది విదేశాల నుంచి వ‌చ్చిన‌వారే. ఎటువంటి ల‌క్ష‌ణాలు లేని పేషెంట్ల 27 మంది న‌మోదు అయిన‌ట్లు జాతీయ ఆరోగ్య శాఖ పేర్కొన్న‌ది.  విదేశాల నుంచి వ‌స్తున్న వారిలో పాజిటివ్  కేసులు కూడా త‌గ్గిన‌ట్లు ఆ దేశం పేర్కొన్న‌ది.  చైనాలో వైర‌స్ సంక్ర‌మించిన వారి సంఖ్య 82,798కి చేరుకున్న‌ది.  మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 4632గా ఉన్న‌ది.  సుమారు 77 వేల మంది వైర‌స్ నుంచి కోలుకున్నారు. అయితే చైనాలో సంభ‌విస్తున్న మ‌ర‌ణాల‌పై ప్ర‌పంచ దేశాలు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నాయి.  కావాల‌నే ఆ దేశం మ‌ర‌ణాల డేటాను త‌క్కువ‌గా చెబుతున్న‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.


logo