న్యూఢిల్లీ, మే 31: భారత్‌లో గత అక్టోబర్‌లో తొలిసారిగా వెలుగుచూసిన బీ.1.617.2 వేరియంట్‌ను ‘డెల్టా వేరియంట్’గా పిలువాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సోమవారం పేర్కొంది. బీ.1.617.2 వేరియంట్‌ను కొన్ని పత్రికలు, సంస్థలు ‘భారత వేరియంట్’గా పిలువడంపై కేంద్రప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బీ.1.617.2 వేరియంట్‌ను ‘భారత వేరియంట్’గా పేర్కొంటూ ప్రచారమవుతున్న కంటెంట్‌ను తొలగించాలని అన్ని సోషల్‌మీడియా వేదికలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో దేశాలను బట్టి వేరియంట్లకు పేర్లు పెట్టడం తగదని మే 12న డబ్ల్యూహెచ్‌వో ఓ ప్రకటన చేసింది. వేరియంట్లను తాము శాస్త్రీయ పేర్లతోనే పిలుస్తున్నట్టు, అందరూ అలాగే పిలువాలని వెల్లడించింది. తాజాగా వేరియంట్లకు గ్రీక్ అక్షరమాలను అనుసరించి నామకరణం చేసింది. ఈ విధానంతో సులభంగా వేరియంట్లను గుర్తుపట్టొచ్చని వివరించింది. కాగా, బీ.1.617.2 వేరియంట్ తీవ్రత ఎక్కువగా ఉన్నదని, వేగంగా వ్యాపిస్తున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇప్పటివరకూ అధికారికంగా 53 దేశాల్లో, అనధికారికంగా మరో ఏడు దేశాలకు ఈ వేరియంట్ వ్యాపించింది.
వేరియంట్ వెలుగుచూసిన డబ్ల్యూహెచ్‌వో
దేశం పెట్టిన పేరు
బీ.1.617.2 భారత్ డెల్టా
బీ.1.617.1 భారత్ కప్పా
బీ.1.1.7 బ్రిటన్ ఆల్ఫా
బీ.1.351 దక్షిణాఫ్రికా బీటా
పీ.1 బ్రెజిల్ గామా
బీ.1.427 అమెరికా ఎప్సిలాన్